Sunday, December 22, 2024

బాక్సాఫీస్ సక్సెస్ సాధించిన ‘దేవర’

- Advertisement -
- Advertisement -

జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమా బాక్సాఫీసు వద్ద  సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు కొరటాల శివ , ఎన్టీఆర్ తో యాక్షన్ డ్రామా బాగా పండించాడు. సైఫ్ అలీ ఖాన్, శ్రీకాంత్, ప్రకాశ్ రాజ్, అజయ్, జాహ్నవి కపూర్ తదితర నటీనటులు కూడా బాగానే నటించారు. అయితే సినిమా అంతా ఎన్టీఆర్ డామినేషనే కనిపిస్తుంది. ఈ సినిమా పూర్తిగా యాక్షన్ సినిమా కావడంతో కొంత మందికి మామూలు సినిమాగానే కనిపించొచ్చు.

కథ విషయానికి వస్తే… ఓడలపై దోపిడి, పగ, ఎర్రసముద్రం అని పిలవబడే నాలుగు గ్రామాల ప్రజల కథ. తమ పూర్వీకుల ఆయుధాలు తమ గ్రామానికే దక్కాలని ప్రతి ఏడాది ఆ నాలుగు గ్రామాల ప్రజలు కోరుకుంటారు. దానిని పొందేందుకు మల్లయుద్ధం వంటి ఘోరమైన పోరు కూడా ఉంటుంది. సముద్రపు తీరపు గ్రామాల కల్పిత కథ. సముద్రంపై సాగుతున్న దోపిడిని ఆపడానికి ఓ పోలీస్ అధికారి పూనుకోవడంతో కథ మొదలవుతుంది. అయితే దేవర ఏమి చెబితే అది అన్నట్లు ఆ నాలుగు ఊర్లలో చెల్లుబాటవుతుంది. కానీ సముద్రం మీద ఆయుధాల స్మగ్లింగ్ అవుతోందని తెలుసుకున్నాక దేవర(ఎన్టీఆర్) తీరు మారుతుంది. కథ కొత్త మలుపు తిరుగుతుంది. భైరవ(సైఫ్ అలీ ఖాన్)తో  దేవర(ఎన్టీఆర్) ఎందుకు దూరం అవుతాడనేది తెరపైనే చూడాలి. చివరికి సినిమా కథ సస్పెన్స్ తో ముగుస్తుంది. యాక్షన్ సినిమాలు కోరుకునే వారికి మాత్రమే ఈ సినిమా బాగా నచ్చొచ్చు. కుటుంబ చిత్రం అని చెప్పలేము. కామెడీ లేదు. అంతా సీరియస్ గా సాగే యాక్షన్ సినిమా. నటన పరంగా అందరూ బాగానే చేశారు. కానీ ఎంటర్ టైన్ మెంట్ లోపించినట్లు అనిపిస్తుంది. ఈ సినిమా నిడివి 178 నిమిషాలు. థియేటర్లలో సినిమా బాగానే ఆదరణ పొందుతోంది. ఆరు రోజుల్లో దాదాపు రూ. 400 కోట్ల మేరకు ఈ సినిమా రాబట్టింది. ఈ సినిమా పార్ట్-1 మాత్రమే. దీని సీక్వెన్స్ రానున్నది.

రేటింగ్: 3.5

రివ్యూ: అశోక్

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News