Monday, January 20, 2025

దేవర దండయాత్ర.. మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె నిర్మించిన ఈ మూవీ తాజాగా వరల్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బాలీవుడ్ వర్సటైల్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. భారీ అంచనాలతో విడుదలైన ‘దేవర’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.172 కోట్ల వసూళ్లను సాధించింది. అదే స్పీడుని కొనసాగిస్తోంది.

ఈ వారాంతం ముగిసే వరకు అంటే మూడు రోజుల్లోనే రూ.304 కోట్లు గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించటం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తుంటే 80 శాతం రికవరీ అయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో ‘దేవర’ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో రూ.87.69 షేర్ కలెక్షన్స్ సాధించింది. అలాగే హిందీలోనూ చక్కటి వసూళ్లు వస్తోంది. నార్త్ బెల్ట్‌లో దేవర సినిమా కలెక్షన్స్ నెమ్మదిగా పెరుగుతూ వస్తున్నాయి. నాలుగో రోజు కూడా థియేటర్స్ అన్నీ హౌస్‌ఫుల్ తో కొనసాగుతుండటం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News