Thursday, December 26, 2024

బాక్సీఫీస్ వద్ద దేవర విధ్వంసం.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

- Advertisement -
- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సెప్టెంబర్ 27న విడుదలైన ఈ సినిమా పాజిటీవ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో భారీగా కలెక్షన్స్ రాబడుతోంది. ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు రూ.172 కోట్లు వసూలు చేసిందని.. ఇక, 2 రోజుల్లో రూ.243 కోట్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

ఈ సందర్భంగా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆదివారం సెలవు కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. కాగా మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో దేవర, వర రెండు పాత్రల్లో ఎన్టీఆర్ నటించారు. ఆయనకు జోడీగా జాన్వీ కపూర్ నటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News