Wednesday, January 22, 2025

‘ఆయుధపూజ’ పాట వచ్చేస్తోంది

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘దేవర’ చిత్ర ప్ర మోషన్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ప్ర తిష్టాత్మక మూవీని పాన్ ఇండియా సినిమాగా పలు భాషల్లో గ్రాండ్ స్కే ల్‌తో రిలీజ్ చేయబోతున్నారు. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా మూవీలో తారక్ డ్యుయెల్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇక ఇటీవల ముంబైలో దేవర చిత్ర ప్ర మోషన్స్‌లో పాల్గొన్న తారక్, ఇప్పు డు తమిళనాట ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. దేవర సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్, యువసుధ ఆర్ట్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. ‘దేవర’ సినిమా ఈనెల 27న వరల్డ్ వైడ్ రిలీజ్‌కి రెడీ అయ్యింది. పూర్తి యా క్షన్ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకుల ను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇ క ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్‌కి వి శేషమైన స్పందన దక్కింది. ఇక ఈ చిత్ర లిరిసిస్ట్ రామ జోగయ్య శాస్త్రి ‘ఆయుధపూజ’ పాట బుధవారం లే దా గురువారం విడుదల కాబోతున్న ట్లు తెలిపారు. ఈ అప్డేట్‌తో అభిమానులు థ్రిల్ అవుతున్నారు. ఇక ఈ పాట ఈ చిత్రానికే హైలైట్‌గా ఉండబోతుందని మేకర్స్ చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News