Wednesday, January 22, 2025

అరుదైన ఘనత.. బియాండ్ ఫెస్ట్‌లో ‘దేవర’

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను సృష్టిస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. అందులో ‘దేవర పార్ట్ 1’లోని సాంగ్స్ అన్నీ చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో దేవర ప్రీమియర్ షోను ఈనెల 26న సాయంత్రం ఆరున్నర గంటలకు బియాండ్ ఫెస్ట్‌లో హాలీవుడ్, లాస్ ఏంజిల్స్‌లోని ఐకానిక్ ఈజిప్షియన్ థియేటర్‌లో ప్రదర్శించనున్నారు. బియాండ్ ఫెస్ట్ ఘనమైన సినిమా చరిత్రను కలిగిన ప్రతిష్టాత్మకమైన సినిమా వేదిక.

ఇలాంటి వేదికలో రెడ్ కార్పెట్ ఈవెంట్ జరగటం గొప్ప విషయం. అలాగే ఇక్కడ ప్రీమియర్ కాబోతున్న తొలి ఇండియన్ సినిమాగా దేవర అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ఈ రెడ్ కార్పెట్ ఈవెంట్‌కు హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. దేవర టీమ్‌తో పాటు హై ఫై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులు పాల్గొంటుండటం అనేది ప్రపంచ వేదికపై దేవర ఖ్యాతిని మరింత ఇనుమడింప చేయనుంది. ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, అజయ్, గెటప్ శీను తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News