Tuesday, September 17, 2024

అదరగొట్టిన దేవర ట్రైలర్ .. రచ్చ చేస్తున్న ఫ్యాన్స్

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. మంగళవారం మేకర్స్ ‘దేవర’ మూవీ థియేట్రికల్ ట్రైలర్ వేడుకను ముంబైలో ఘనంగా నిర్వహించారు. నిర్మాత కరణ్ జోహార్, అనిల్ తడాని సహా పలువురు ప్రముఖులు వేడుకకు హాజరయ్యారు. 2 నిమిషాల 35 సెకన్లు ఉన్న ఈ ట్రైలర్ మాస్ ఎలిమెంట్స్ ప్యాక్ట్‌గా ఉంది.

ఎన్టీఆర్ అభిమానులకు, యాక్షన్ మూవీ లవర్స్ కోరుకునే అంశాలతో నిండి ఉంది. ఈ మూవీ కోసం దర్శకుడు కొరటాల శివ సృష్టించిన ప్రత్యేకమైన ప్రపంచం, ఆయన విజన్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్‌ను గమనిస్తే ప్రకాష్ రాజ్ గంభీరమైన వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైంది. తీరప్రాంతంలో ఎలాంటి భయాలు లేని ప్రజలు నివసిస్తుంటారు. అక్కడ ఉండే భైరా (సైఫ్ అలీఖాన్) ఓ క్రూరమైన గ్యాంగ్‌తో అకృత్యాలకు పాల్పడుతుంటాడు. ఆ ముఠా అక్కడకొచ్చే ఓడలను దోచుకోవటమే కాకుండా, కోస్ట్ గార్డులను కూడా చంపేస్తూ రక్తపాతాన్ని సృష్టిస్తుంటారు.

ఇలాంటి కొంత మంది కరుడుగట్టిన గ్రామస్థులకు భయాన్ని పరిచయం చేస్తాడు ‘దేవర’ (ఎన్టీఆర్) . ఆ గ్రామాన్ని పెను ప్రమాదం నుంచి రక్షించే పవర్‌ఫుల్ పాత్రలో ఎన్టీఆర్ పాత్ర మనకు పరిచయం అవుతుంది. ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజన్స్, అద్భుతమైన డైలాగ్ డెలివరీ, ఆశ్చర్యపరిచే ఎలివేషన్ సన్నివేశాలతో ఉన్న ఈ ట్రైలర్ అందరిలో సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భయానికి అర్థం చెప్పే ప్రతిరూపమైన పాత్ర ఒకటైతే.. భయపడుతూ ఉండే మరో పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్నారు. భైరా అనే భయంకరమైన పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించారు. ఎన్టీఆర్, సైఫ్ మధ్య ఉన్న సన్నివేశాలను చూస్తుంటే సినిమా నెక్స్ లెవల్ అనేంతగా అంచనాలు పెరిగిపోతున్నాయి.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, అజయ్, గెటప్ శీను తదితరులను మనం ట్రైలర్‌లో చూడొచ్చు. జాన్వీకపూర్ ఇందులో తంగం అనే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించింది. ఆమె లుక్స్ చూపరులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. ఎన్టీఆర్, జాన్వీ మధ్య ఉన్న చక్కటి కెమిస్ట్రీతో సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయనిపిస్తుంది. అనిరుద్ రవిచందర్ అద్భుతమైన సంగీతంతో పాటు యాక్షన్ సన్నివేశాలకు ఆయన అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ వింటుంటే అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 27న దేవర చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News