Monday, January 20, 2025

మారిన ‘దేవర’ రిలీజ్ డేట్

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో ఈ మూవీ అత్యద్భుతంగా.. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రను పోషిస్తున్నారు.

గురువారం చిత్ర యూనిట్ ‘దేవర’ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ప్రేక్షకులకు హై యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించటానికి దీన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. అందులో తొలి భాగం ‘దేవర: పార్ట్ 1’, సెప్టెంబర్ 27న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలకానుంది.

తాజా రిలీజ్ డేట్ ప్రకటనతో ‘దేవర’ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి. ఎన్టీఆర్ పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజన్స్, కొరటాల శివ టేకింగ్‌ను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై చూద్దామా అని అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘దేవర’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News