Sunday, January 19, 2025

యుఎస్‌లో ‘దేవర’ ప్రీ సేల్స్ జోరు

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను సృష్టిస్తోంది. అభిమానులు సహా అందరూ ఎంతో ఆతృతగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మధ్య విడుదలైన ఫియర్ సాంగ్, చుట్టమల్లే.., దావుడి సాంగ్స్‌కు, టీజర్ కు వచ్చిన స్పందనతో సినిమాపై ఉన్న అంచనాలు నెక్ట్స్ లెవల్‌కు చేరుకున్నాయి.

ఓవర్సీస్‌లో ‘దేవర’ అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని ప్రత్యాంగిర సినిమాస్ అమెరికాలోనే ఎప్పుడు ఎవరూ చేయనంత గొప్పగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల ప్రీ బుకింగ్స్‌ను యుఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ ఇప్పటికే ప్రీ సేల్స్ ఐదు లక్షల డాలర్స్‌ను దాటేయటం విశేషం. సినిమాపై ఉన్న బజ్, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ తగ్గటం లేదు. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాటిక్ ఫీల్‌ను తెరపై ఎంజాయ్ చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. అభిమానులు టికెట్స్ కోసం ఎగబడుతున్న తీరు చూస్తుంటే ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర జోరు చూపించనుందని తెలుస్తోంది.

ఈ అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈనెల 27న విడుదల చేస్తున్నారు. ‘దేవర’గా టైటిల్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ , షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆరట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News