Monday, December 23, 2024

దేవరగట్టు బన్నీ ఉత్సవంలో ప్రమాదం… ఒకరు మృతి… వంద మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టు బన్సీ ఉత్సవంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కర్రల సమరం చూసేందుకు చెట్టు ఎక్కి పలువురు స్థానికులు కిందపడ్డారు. చెట్టుకొమ్మ విరిగిపడడంతో యువకుడు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. దసరా సందర్భంగా దేవరగట్టులో బన్నీ ఉత్సవం జరుగుతుంది. దేవరగట్టులో స్వామి, అమ్మవారికి కల్యాణం చేయడంతో పాటు అనంతరం ఊరేగిస్తారు. ఉరేగించిన అనంతరం ఉత్సవ విగ్రహాలు దక్కించుకునేందుకు యువకులు, గ్రామస్థులు కర్రల సమరంలో పాల్గొంటారు. కర్రల సమరంలో హింస చెలరేగడంతో వంది మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Also Read: బిఆర్ఎస్ ‘ఘర్ వాపసీ’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News