నల్లగొండ: పెళ్లైన వ్యక్తితో ప్రేమలో పడి ఓ యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. మైనంపల్లి గ్రామ పంచాయతీలోని కొర్ర తండాకు చెందని నేనావత్ చిన్ని(18), అదే గ్రామానికి చెందిన విజయ్‌తో ప్రేమలో పడింది. విజయ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చిన్నికి వివాహం చేయాలని ఆమె తండ్రి మాన్సింగ్ పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అంతేకాకుండా తన మరో వ్యక్తితో పెళ్లి జరుగుతోందని ఆందోళన చెందడంతో పాటు విజయ్ లేని జీవితం వ్యర్థం అనుకుంది.
Also Read: పదేళ్ల పాలన.. ప్రగతికి నమూనా
చిన్ని కనిపించకపోవడంతో విజయ్‌ను ఆమె తల్లిదండ్రులు నిలదీశారు. చిన్నిని మరో వ్యక్తిని పెళ్లి చేసుకోనని, తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోమని నచ్చజెప్పానని విజయ్ వివరించాడు. తనని పెళ్లి చేసుకోమ్మని పలుమార్లు అడిగినప్పటికి తనకు ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారని, పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పానన్నారు. రెండు రోజుల తరువాత గ్రామ శివారులోని బావిలో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ తన కూతురుని చంపి బావిలో పడేసి ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపణలు చేశారు. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికి కాదన్నారు.