- Advertisement -
దేవరుప్పుల: జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు వాహనాలు ఢీకొని ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు యాకన్న, సంపత్‌గా గుర్తించారు. మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం దేవరుప్పుల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
- Advertisement -