Wednesday, January 22, 2025

#AshokGalla2 నుంచి ‘దేవదత్త నాగే’ వైలెంట్ లుక్

- Advertisement -
- Advertisement -

‘హీరో’ చిత్రంతో గ్రాండ్ గా డెబ్యూ చేసిన సూపర్ స్టార్ కృష్ణ మనవడు, సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తన రెండవ సినిమా ‘గుణ 369’ ఫేమ్ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో చేస్తున్నారు. #AshokGalla2 చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథ అందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ ప్రొడక్షన్ నంబర్ 1గా ఎన్నారై (ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్) సోమినేని బాలకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కె సాగర్ సహ నిర్మాత కాగా నల్లపనేని యామిని సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ రోజు మేకర్స్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న ఆదిపురుష్ ఫేమ్ దేవదత్త నాగే ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో కంసరాజు అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు దేవదత్త. ఫస్ట్ లుక్ లో కత్తి పట్టుకుని చాలా వైలెంట్ గా కనిపించారు. ఈ చిత్రంలో అశోక్ గల్లా కు జోడిగా మిస్ ఇండియా 2020 మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు.  ధమాకా చిత్రానికి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందించిన కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్, తమ్మిరాజు ఎడిటర్. బుర్రా సాయిమాధవ్ డైలాగ్స్ అందిస్తున్నారు. త్వరలోనే టీజర్, టైటిల్ ని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News