Wednesday, January 22, 2025

ప్రజ్వల్ కేసులో మౌనం వీడిన దేవెగౌడ

- Advertisement -
- Advertisement -

తన మనవడు, హసన ఎంపి ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలపై మాజీ ప్రధాని, జెడిఎస్ అద్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ శనివారం మొదటిసారి స్పందించారు. ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న అందరిపైన చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. ఈ కేసులో ఉన్నవారందిరపైన చర్యలు తీసుకోవాలని తన 91వ జన్మదినం సందర్భంగా ఒక ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆయన కోరారు. వారి పేర్లను తాను ప్రస్తావించబోనని ఆయన అన్నారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్నట్లు అనుమానిస్తున్న ప్రజ్వల్‌కు సంబంధించి

వెల్లువెత్తుతున్న ఆరోపణలపై దేవెగౌడ స్పందించడం ఇదే మొదటిసారి. తన మనవడు ప్రజ్వల్ రేవణ్ణపైన కూడా చర్యలు ఉంటాయని దేవెగౌడ స్పష్టం చేశారు. అయితే ప్రజ్వల్ తండ్రి, తన పెద్ద కుమారుడైన రేవణ్ణకు సంబంధించి ఆయన పైన పెట్టిన కేసులు ఏమిటో అందరికీ తెలుసునని అన్నారు. రేవణ్ణకు బెయిల్ వచ్చిందని, మరో ఉత్తర్వు పెండింగ్‌లో ఉందని ఆయన తెలిపారు. ప్రజ్వల్ బాధితులలో ఒకరైన ఒక మహిళను కిడ్నాప్ చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి రేవణ్ణను కర్నాటక పోలీసులు ఈ నెల మొదట్లో అరెస్టు చేయగా ఇటీవలే ఆయనకు బెయిల్ లభించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News