Sunday, November 3, 2024

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను: దేవె గౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : తన వయస్సు దృష్టా తాను రానున్న లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయబోవడం లేదని మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ శనివారం ప్రకటించారు. అయితే, ఆ ఎన్నికలలో అభ్యర్థుల తరఫున తాను ప్రచారం చేస్తానని 90 ఏళ్ల జెడి (ఎస్) సుప్రీమో దేవెగౌడ విలేకరుల గోష్ఠిలో తెలియజేశారు. ‘నేను ఎన్నికలలో పోటీ చేయడం లేదు. నాకు ఇప్పుడు 90 ఏళ్లు. మాకు ఏ సీట్లు లభించినా, ఎక్కడ అవసరమైనా అక్కడికి వెళతా. మాట్లాడేందుకు ఒకింత సత్తా, జ్ఞాపక శక్తి ఉన్నాయి. దానితో నేను ప్రచారం చేస్తాను’ అని ఆయన తెలిపారు. ఇక జెడి (ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డి కుమారస్వామి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడం గురించిన ప్రశ్నకు దేవెగౌడ సమాధానం ఇస్తూ,

ఆ విషయమై ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ ఏమి చేసినా దానిని అనుసరిస్తామని ఆయన తెలిపారు. అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామ మందిరం గర్భగుడిలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ఠాపన ముందెఉ 11 రోజుల పాటు ఉపవాస దీక్ష చేస్తున్నందుకు మోడీ ని దేవెగౌడ కొనియాడారు. మోడీ ఎంతో పుణ్యం చేసుకున్నారని, అందుకే ఆయన అకుంఠిత దీక్షతో, ఆధ్యాత్మిక క్రమశిక్షణతో రామ మందిరం ప్రతిష్ఠాపనను నిర్వహించగలరని గౌడ అన్నారు. తన సతీమణి చెన్నమ్మతో కలసి తాను ఈ నెల 22న అయోధ్యలో ఆ కార్యక్రమానికి హాజరు కాగలనని గౌడ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News