Tuesday, January 21, 2025

బిజెపితో అంటకాగనిది ఎవరు: దేవెగౌడ

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ఏది మతతత్వ పార్టీనో ఏది కాదో తాను చెప్పలేనని మాజీ ప్రధాని, జెడి(ఎస్) అధినేత హెచ్‌డి దేవె గౌడ వ్యాఖ్యానించారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి కోసం ప్రస్తుతం కొనసాగుతున్న ప్రయత్నాల పట్ల తాను ఆశాజనకంగా లేనని ఆయన చెప్పారు.

మంగళవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ&ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో బిజెపితో పొత్తు పెట్టుకోని రాజకీయ పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉందా అని ప్రశ్నించారు. ఈ దేశ రాజకీయాల గురించి తాను సవివరంగా విశ్లేషించగలనని, కాని దాని వల్ల ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేస్తున్న ప్రయత్నాల గురించి విలేకరులు ప్రశ్నించగా&ఈ దేశంలో బిజెపితో పొత్తు పెట్టుకోని ఒక్క రాజకీయ పార్టీ పేరు చెబితే తాను ఈ ప్రశ్నకు జవాబిస్తానని దేవెగౌడ అన్నారు.

బిజెపితో తమకు ఎటువంటి సంబంధాలు లేవని కాంగ్రెస్ నాయకులు కొందరు వాదించవచ్చని, అయితే ఆరేళ్ల పాటు బిజెపికి ప్రత్యక్షంగా లేక పరోక్షంగా మద్దతిచ్చిన కరుణానిధి వద్దకు వారు వెళ్లలేదా అని ఆయన ప్రశ్నించారు. అందుకే ఈ దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితి గురించి తాను మాట్లాడదలచుకోలేదని, తాను ప్రధానిగా, ముఖ్యమంత్రిగా, ఎంపిగా తాను చాలా చూశానని ఆయన చెప్పారు. మహారాష్ట్రలో ఏం జరిగింది&అలాంటివి అనేక సంఘటనలు నేను చెప్పగలను అంటూ దేవెగౌడ వ్యాఖ్యానించారు.

భావ సారూప్యంగల పార్టీలు అభ్యర్థిస్తే బిజెపి వ్యతిరేక కూటమికి సారథ్యం వహించడం లేక చేరడం గురించి విలేకరుల ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఎవరిది మతతత్వం..ఎవరిదిమతతత్వం కాదు అన్నది తనకే తెలియడం లేదని ఆయన అన్నారు. ముందు మతతత్వం..మతతత్వ రహితం అన్న పదాలకు నిర్వచనం చెబితే దీనిపై విస్తృతంగా మాట్లాడవచ్చు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News