బెంగళూరు: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిజెపితో పొత్తు తమ పార్టీ నిరయాన్ని జెడిఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ సమర్ఙంచుకున్నారు. తమ పార్టీని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, లౌకికవాద సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటామని, మైనారిటీల నమ్మకాన్ని వమ్ముచేయబోమని ఆయన స్పష్టం చేశారు.
బుధవారం నాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జెడిఎస్‌కు అధికార దాహం లేదని, అవకాశవాద రాజకీయాలకు పాల్పడబోదని ఆయన చెప్పారు. తమ పార్టీ లౌకికవాద సిద్ధాంతాలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని ఆయన చెప్పారు. తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాను గత శుక్రవారం ఢిల్లీలో కలసి బిజెపితో తమ పార్టీ పొత్తు ఉంటుందని ప్రకటించడానికి ముందే తాను అమిత్ షాతో సమావేశమై కర్నాటకలో రాజకీయ పరిస్థితిని గురించి సవివరంగా చర్చించానని దేవెగౌడ తెలిపారు.
ఎవరికీ తాను భయపబోనని, తన ఏళ్ల రాజకీయ పోరాటంలో తన పార్టీ వల్ల ఏ మతానికి అన్యాయం జరగనివ్వలేదని ఆయన చెప్పారు. తాము అధికార దాహంగల రాజకీయ నాయకులం కాదని ఆయన స్పష్టం చేశారు. తన మొత్తం రాజకీయ జీవితంలో ఒకటిన్నర సంవత్సరాలు ప్రధానిగా, పది నెలలు ముఖ్యమంత్రిగా మాత్రమే పదవులు అనుభవించానని ఆయన చెప్పారు. అమిత్ షాతో ప్రాథమిక చర్చలు జరిపిన తర్వాత బిజెపితో పొత్తుపై ముందుకు వెళ్లాలని కుమారస్వామికి చెప్పానని ఆయన తెలిపారు.
దేశ్యాప్తంగా లౌకికవాద శక్తులను అంతం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని దేవెగౌడ ఆరోపించారు. తమపార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా జెడిఎస్‌ను అంతం చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్యను జెడిఎస్ నుంచి నుంచి తాము పంపలేదని, ప్రభుత్వాన్ని ఏర్పాటు ,చేసేందుకు అవగాహన కుదర్చుకునేందుకు 2004లో చెన్నైలో వెంకయ్య నాయుడును సిద్దరామయ్య కలుసుకున్నారని కుమారస్వామి ఆరోపించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు జెడిఎస్ లౌకికవాద సిద్ధాంతం గురించి సిద్దరామయ్య ఉపదేశాలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.