Sunday, November 17, 2024

ఎక్కడున్నా వచ్చి లొంగిపో..నా సహనాన్ని పరీక్షించొద్దు

- Advertisement -
- Advertisement -

మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు దేవెగౌడ హెచ్చరిక

బెంగళూరు: తన మనవడు, హసన్ ఎంపి ప్రజ్వల్ రేవణ్ణకు మాజీ ప్రధాని, జెడిఎస్ అధినేత హెచ్‌డి దేవెగౌడ గురువారం తీవ్రమైన హెచ్చరికలు జారీచేశారు. వెంటనే భారత్‌కు తిరిగి వచ్చి పోలీసులకు లొంగిపో..లేకుంటే నా కోపాన్ని చవిచూస్తావు అంటూ ప్రజ్వల్‌ను దేవెగౌడ హెచ్చరించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా దేవెగౌడ తన మనవడు ప్రజ్వల్‌ను ఉద్దేశించి ఒక లేఖను పోస్టు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణకు నా హెచ్చరిక శీర్షికతో ఆయన ఈ లేఖ రాశారు. ఎక్కడ ఉన్నా వెంటనే తిరిగివచ్చి న్యాయ ప్రక్రియను ఎదుర్కోవాలని ప్రజ్వల్ రేవణ్ణకు హచ్చరిక జారీచేశాను. నా సహనానికి అతను ఇక పరీక్ష పెట్టకూడదు. ప్రజ్వల్ పాల్పడిన అకృత్యాలకు సంబంధించిన ఆరోపణల గురించి నాకు తెలియదని ఎవరికీ నేను నచ్చచెప్పలేనప్పటికీ పోలీసులకు లొంగిపోవాలని మాత్రం అతనికి హెచ్చరిక ఇవ్వగలను.

నా హెచ్చరికను అతను ఖాతరు చేయనిపక్షంలో నా కోపాన్ని, నా కుటుంబ సభ్యులందరి కోపాన్ని అతను ఎదుర్కోక తప్పదు అని దేవెగౌడ తన లేఖలో పేర్కొన్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27న దేశం విడిచి జర్మనీకి పారిపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణల దర్యాప్తు కోసం కర్నాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బ౧ందాన్ని ఏర్పాటు చేసింది. మే 18న ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లినపుడు మీడియాతో ప్రజ్వల్ రేవణ్ణ గురించి మట్లాడానని ఆ లేఖలో దేవెగౌడ పేర్కొన్నారు.

తన యులుంబానికి, తన సహచరులకు, మిత్రులకు, పార్టీ కార్యకర్తలకు అతను(ప్రజ్వల్) చేసిన పనికి కలిగిన దిగ్భ్రాంతి, బాధ నుంచి కోలుకోవడానికి తనకు కొంత సమయం పట్టిందని ఆయన తెలిపారు. తప్పు చేసి ఉంటే ప్రజ్వల్ రేవణ్ణ కఠినాతి కఠినమైన శిక్షను ఎదుర్కోక తప్పదని తాను చెప్పానని, తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని దేవెగౌడ పేర్కొన్నారు. ప్రజ్వల్ రేవణ్ణపై(లైంగిక దాడి కుంభకోణం) స్పందించిన ప్రజలంతా అతడిని, అతని కుటుంబాన్ని గత కొన్ని నెలలుగా తీవ్రమైన పదజాలంతో దూషిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు వాటి గురించి తెలుసునని, వాటిని ఆపాలని తాను భావించడం లేదని దేవెగౌడ తెలిపారు. నిజాలు వెలుగులోకి వచ్చేవరకు వేచి ఉండాలని కూడా తాను ఎవరితో వాదించడానికి ప్రయత్నించడం లేదని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News