Thursday, January 23, 2025

ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ : ప్రపంచ స్థాయి పర్యాటకులను ఆకర్షించే విధంగా కరీంనగర్‌ను తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరా ల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్‌లోని తెలంగాణచౌక్‌లో రూ. కోటి 20 లక్షలతో ఆధునికరించిన అత్యాధునిక ఐలాండ్‌ను నగర మేయర్ వై సునీల్‌రావుతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వాటర్ ఫౌంటెన్, డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌తో హైలాండ్ జంక్షన్ అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. కరీంనగర్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ అభివృద్ధిలో భాగంగా నగరంలోని తెలంగాణ చౌక్ హైలాండ్ జంక్షన్ అత్యాధునిక హ ంగులతో కొత్తగా రూపుదిద్దుకుందన్నారు.

అందమైన డిజైన్ ఆకృతి, అబ్బురపరిచే వాటర్ ఫౌంటెన్, చక్కటి డైనమిక్ లైటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరానికి వన్నెతెచ్చే విధంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ సేవా ఇస్లావత్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, పలువురు పాలకవర్గ సభ్యులతో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభం చేశారు. వాటర్ ఫౌంటెన్, లైటింగ్ సిస్టమ్‌ను ఆన్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్మార్ట్‌సిటీ, నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News