Monday, December 23, 2024

రాష్ట్రంలో బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నాం

- Advertisement -
- Advertisement -

Developing Buddhist Heritage Centres in Telangana: Srinivas Goud

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తైవాన్ దేశ ప్రతిష్టాత్మక మహాబోధి సొసైటీ ప్రతినిధులు శ్రమనెర, బిక్షు బుద్ధ దత్త, సాగటనందాలు బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ బుద్ధుడి తర్వాత మరో బుద్ధుడిగా పేరుగాంచిన ఆచార్య నాగార్జునుడు నడియాడిన ప్రదేశం, తొలి బౌద్ధ విశ్వవిద్యాలయ కేంద్రం కృష్ణానది ఒడ్డున ఉన్న నాగార్జున సాగర్‌లో 274 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో బౌద్ధ వారసత్వ కేంద్రాన్ని అభివృద్ధి చేశామన్నారు.

ఈ సందర్భంగా బుద్ధవనం అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించి దశల వారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ఉన్న బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధి, అంతర్జాతీయంగా ఉన్న పర్యాటకులను ఆకర్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో తైవాన్ నుంచి వచ్చిన బౌద్ధ బిక్షువులు నాగార్జునసాగర్‌లో ఉన్న బుద్ధవనం ప్రాజెక్టులో ప్రసిద్ధ మహాబోధి సొసైటీ ఆధ్వర్యంలో బౌద్ధ ఆరామాలు, ధ్యాన మందిరాలు నిర్మాణం, ఆధ్యాత్మిక విద్యా కేంద్రాల ఏర్పాటుకు స్థలాన్ని కేటాయిం చాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు ప్రతిపాదనలు సమర్పించారు. తైవాన్‌కు చెందిన మహాబోధి సొసైటీకి చెందిన బిక్షువులు సమర్పించిన ప్రతిపా దనలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. వెంటనే ప్రతిపాదనలు పరిశీలించాలని బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో బుద్ధవనం ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Developing Buddhist Heritage Centres in Telangana: Srinivas Goud

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News