Thursday, January 23, 2025

అభివృద్ధి, సంక్షేమం బిఆర్‌ఎస్‌తోనే సాధ్యం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: మండలంలోని పెరకపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 మంది మహిళలు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈ శ్వర్ సమక్షంలో ఆదివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. సర్పంచ్ మొట్టే లక్ష్మీ ఆధ్వర్యంలో గంగిపల్లి స్వామితోపాటు, యువకు లు, మహిళలు బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరేందుకు ముందుకు రాగా మంత్రి ఈశ్వర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ 9 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పార్టీలో చేరడం సంతోషకరమని అన్నా రు. అభివృద్ధి సంక్షేమం బీఆర్‌ఎస్‌పార్టీతోనే సాధ్యమైందని, బీజేపీకి తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.

జై శ్రీరామ్ నినా దంతో బీజేపీ కొత్త డ్రామాలు ఆడుతుందని, ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందని అన్నారు. శ్రీరాముడు అందరి దేవుడని, నినాదాలు కొత్తగా లేదని బీజేపీ కావాలనే ప్రజల్లో గందరగోళం చేస్తున్నదని అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నీరు గార్చేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి సరైన గుణపాఠం చెప్పాలని యువకులు, మహిళలు, సంఘటితంగా వచ్చే ఎన్నికల్లో పని చేసి మూడోసారి సీఎం కేసీఆర్ సీఎం అయ్యేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముత్యాల కరుణశ్రీ బలరాంరెడ్డి, జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్, మండల అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కూరపాటి శ్రీనివాస్, సర్పంచ్ మొట్టే లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News