మణుగూరు : అభివృద్ధి, సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎంఎల్‌ఎ, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. ఆదివారం మణుగూరు మండలంలోని ఎంఎల్‌ఏ క్యాంప్ కార్యాలయంలో రాష్ట్రం ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లలా భావించి అన్ని వర్గాలకు ఆమోద యోగ్యమైన పరిపాలన అందిస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాలలో మెరుగైన వైద్యం విద్య అందించినందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. దళితబంధు, గృహలక్ష్మీ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గిరిజనులు ఇప్పటికే సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలిస్తాం సర్వే పూర్తి అయిందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. సిఎం కెసిఆర్ ముందు చూపుతో దేశంలో తెలంగాణ అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచిందని, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. జూన్ 24 నుంచి 30 వరకు రాష్ట్రంలో గిరిజనులకు సిఎం కెసిఆర్ చేతుల మీదుగా పోడు భూముల పట్టాల పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. కొత్తగూడెంలో చేసింది పోడు యాత్ర కాదని పాడు యాత్ర అని విమర్శలు జల్లు కురిపించారు. సిఎం కెసిఆర్‌ని విమర్శించే స్థాయి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని, జిల్లాలో పోడుదారులకుపట్టా పాస్ బుక్కులు జిల్లా కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమమే బిఆర్‌ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- Advertisement -
- Advertisement -
- Advertisement -