Friday, November 22, 2024

పల్లెల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ లక్షం

- Advertisement -
- Advertisement -
  • కొందుర్గు మండలంలో ఎమ్మెలే అంజయ్యయాదవ్ సుడిగాలి పర్యటన

కొందుర్గు: మారుమూల గ్రామాల అభివృద్ధి పథంలో నడిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పల్లెల అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ సర్కార్ లక్షమని షాద్‌నగర్ ఎమ్మెలే అంజయ్యయాదవ్ అన్నారు. సోమవారం కొందు ర్గు మండల పరిధిలోని బైరంపల్లి, లాలాపేట, చెరుకుపల్లి, విశ్వనాథ్‌పూర్, లక్ష్మిదేవిపల్లి, అయోధ్యపూర్ తండాలలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేసి బైరంపల్లి గ్రామంలో రూ.15 లక్షల డిఎంఎఫ్ నిధులతో నిర్మించిన ఎస్సి కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.

అనంతరం మిగతా గ్రామాలలో రూ.20 లక్షల నిధులతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాల హయాంలో జరగని అభివృద్ధి పనులు బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్నాయని అన్నారు. ఓ వైపు గ్రామాల అభివృద్ధి మరోవైపు బడుగు, బలహీన వర్గాల ప్రజ ల అభివృద్ధి కోసం కులాల వారీగా ఎన్నో సంక్షేమ ఫలాలను ప్రవేశపెట్టి వారికి బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఆది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని ఆయన అన్నారు.

మారుమూల గ్రామాలు కూడా పట్టణాలను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాలను అభివృద్ధి చేసి పల్లెల రూపురేఖలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసిఆర్‌కే దక్కిందన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం ఆదర్శంగా మారుతుందని, గ్రామాభివృద్ధిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. అనంతరం ఉత్తరాస్‌పల్లి గ్రామంలో అంతర్గత మురుగుకాలువ నిర్మాణపనులకు భూమి పూజ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపిపి పోతురాజు జంగయ్య, వైస్ ఎంపిపి రాజేష్ పటేల్, యంపిడివో ఆంజనేయులు, ఎంపివో లా లయ్య, పంచాయతీ ఎఈ దయాకర్‌రావు, ఆర్‌ఐ మహెందర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దామోదర్ రెడ్డి, తెరాస మండలాధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, తెరాస సీనియర్ నాయకులు సయ్యద్ సాధిక్, రామకృష్ణ , పోతురాజు గోపాల్, ఆయా గ్రా మాల సర్పంచ్, ఎంపిటిసిలు నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News