మన తెలంగాణ/ జనగామ : దేశానికే ఆదర్శంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నట్లు తెలంగాణ పంచాయతీరాజ్‌శాఖ, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి, పెద్దబాయితండా, బోడోనికుంట, చెరువు ముందుతండా, నీలిబండతండా గ్రామాలను కలిపి బోడోనికుంట తండా రోడ్డులోని జీడీ మామిడి తోటలో అలాగే మొండ్రాయి, మైదం చెరువు తండా, గిర్నితండా, రామేశ్వరం, రామారం గ్రామాలను కలిపి రామవరం సింధె రామోజీ మామిడితోటలో బుధవారం ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ దయవల్ల తాను మంత్రి అయినట్లు గుర్తుచేశారు. అదేవిధంగా బాబు జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి సహపంక్తి భోజనాలు చేశారు. లక్ష్మక్కపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కిరణ్‌రావు దంపతులు అందజేసిన వెండితాపడాన్ని దేవాలయానికి మంత్రి ఎర్రబెల్లి దంపతుల చేతుల మీదుగా అందజేశారు. ఈసందర్భంగా బీఆర్‌ఎస్ అమలుచేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనుల ఆవశ్యకతను చర్చించి నిధులు మంంజూరు చేస్తామని తెలిపారు. ఊహించని విధంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు, మహిళలు, యువత ప్రగతిపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. ఒక్కో గ్రామానికి, గ్రామపంచాయతీకి రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేసినట్లు ఎలిపారు. రాష్ట్రంలో మొట్టమొదటగా పాలకుర్తి నియోజకవర్గంలోనే మహిళలు, యువత కోసం ఉచిత కుట్టుశిక్షణ, మిషన్లు, ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చేలా నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని, ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఆయన సతీమణి ఉషాదయాకర్‌రావు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.