Monday, December 23, 2024

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

స్టేషన్ ఘన్‌పూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే అభివృద్ధి పరుగులు పెడుతుందని, ఊరూరా సిసి రోడ్లు, డ్రైనేజీ కాలువల నిర్మాణం పూర్తయిందని జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం చిల్పూర్ మండలంలోని చిన్న పెండ్యాల గ్రామంలో రూ. 15 లక్షల జడ్పీ నిధుల ద్వారా నూతనంగా నిర్మిస్తున్న సైడు డ్రైనేజీ పనులను జనగామ జిల్లా పరిషత్ ఛైర్మన్, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్‌రెడ్డి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మండల సర్పంచులు ఫోరం అధ్యక్షుడు లింగారెడ్డి, ఎంపీటీసీ ఉమ సమ్మయ్య, మండల రైతు కోఆర్డినేటర్ జనగాం యాదగిరి, మాజీ ఎంపీటీసీ తాళ్లపల్లి సంపత్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు గజ్జెల దామోదర్, వార్డుసభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News