Monday, December 23, 2024

భవిష్యత్ తరాలకు అనుగుణంగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: జిల్లాలోని మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ఐలాండ్ మొదల గు పనులన్ని భవిష్యత్తు అవసరలకు అనుగుణంగా నిర్మాణాలను చేపట్టడం జరుగుతుందని రాష్ట్ర బీసి సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ స మావేశ మందిరంలో జిల్లాకు తలమాణికంగా నిర్మిస్తున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులపై మంత్రి గం గుల కమలాకర్ సమీక్షించారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్య్రాన్ని సాధించుకు న్న నాటినుండి మూసపద్దతిలో అభివృద్ధికి ఆమడదూరంలో జీవనాన్ని సాగించామని గుర్తుచేశారు. క నులకు ఆనందానిచ్చే నీరు, పచ్చని వాతావరణంతొ తెలంగాణలో కొత్తశోభను సంతరించుకునేలా ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజేక్టు, హరితహారం వంటి బృ హత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జలకళను సంతరించుకున్న మానేరు ప్రాoతాన్ని భవిష్యత్ తరాల ఆలోచనలకు అనుగునంగా మానేరురివర్ ఫ్రంట్, కేబుల్ బ్రి డ్జీ నిర్మాణాలను చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్ర ఆ విర్బావం అనంతరం తెలంగాణలో అభివృద్ధి పనుల కొరకు వెలువడిన మొట్టమొదటి ప్రభుత్వ ఉత్తర్వు కే బుల్ బ్రిడ్జి నిర్మాణం కోసం అని,కేబుల్ బ్రిడ్జి నిర్మాణాకి పూర్వం సభర్మతి వంటి నిర్మాణాలను పరిశీలించడం జరిగిందని, వాటికన్న గోప్పగా ప్రజలకు వినోదాన్ని అందించడంతో పాటు దక్షిణ భారతంలోనే గొప్పదైన పర్యాటక ప్రాంతంగా కరీంనగర్ జిల్లాలో అ భివృద్ధ్ది పరిచి ప్రపంచస్థాయి పర్యటకులను ఆకర్షించేలా మానేరు రివర్ ఫ్రంట్ పనులను ప్రారంభించుకోవడం జరిగిందని అన్నారు. మొదటి విడతలో కే బుల్ బ్రీడ్జి, డైనమిక్ లైటింగ్, పలు ఐలాండ్ ల నిర్మాణాలను పూర్తిచేసుకోని ప్రారంభించుకోవడం జరిగిందని. రెండవ విడతలో చేపడుతున్న మానేరు రివర్ ఫ్రంట్ పనులను సెప్టెంబర్ మొదటివారంలోగా పూ ర్తి చేసుకోని ప్రారంభించుకునేలా, పటిష్టమైన ప్రణాళిక ప్రకారం పనులు చేపట్టుకొవాలని పిలుపునిచ్చా రు.

మానేరురివర్ ఫ్రంట్ లో ప్రణాళిక ప్రకారం ఏ ర్పాటు చేయనున్న బిగ్ ఓ వంటి వాటిని ప్రత్యక్షంగా పరిశీలించడానికి ఉత్తరకొరియా, సియోల్, యోసు వంటి ప్రాంతాలను సందర్శించడం జరిగిందని, ప్ర జలకు వినోదాన్ని అందించే దిశగా నిర్మించిన బిగ్ ఓ తో పాటు పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించ డం జరిగిందని తెలుపుచూ, పరిశీలించిన పలు ప్రదేశాల ఫోటోలు, వీడియోలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.

జిల్లాలో ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా, పూర్తిస్థాయి ర క్షణ ప్రమాణాలను పాటిస్తు చేపడుతున్న కేబుల్ బ్రిడ్జి నిర్మాణంలో మరింత అభివృద్ధి పరిచి బావితరాలకు ఆస్థిగా అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, సిపి సుబ్బారాయుడు, అడిషనల్ డిసిపి శ్రీని వాస్, గ్రందాలయ చైర్మన్ పోన్నం అనీల్ కుమార్ , డిప్యూటి మేయర్ చల్లస్వరూపారాణి హరి శంకర్ , మార్కెట్ కమిటి చైర్మన్ రెడ్డవేణి మదు, ఇరిగేషన్ పం చాయతీరాజ్ ఆర్ అండ్ బి ఈ ఈ,సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News