Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ పాలనలో ప్రతి పల్లెలో అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: బిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పల్లె ప్రగతి పథంలో పయనిస్తుందని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మొగుళ్ళపల్లి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎంఎల్‌ఏ గండ్ర శుక్రవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్‌పల్లి గ్రామంలో రూ.10లక్షలతో సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా స్వంత ఖర్చులతో వైద్యం చేయించుకొని ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న వారికి చెక్కులను అందించారు. అనంతరం ఎంఎల్‌ఏ గండ్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో ప్రతి పల్లె అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిసి రోడ్ల నిర్మాణం, మిషన్ భగీరథ ద్వారా మంచినీరు వంటి ఎన్నో పథకాలతో ముందుకు వెళ్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News