Monday, January 20, 2025

తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తా: ఫైలెట్ రోహిత్‌రెడ్డి

- Advertisement -
- Advertisement -

తాండూరు : తాండూరు పట్టణాన్ని సమస్యలు లేని పట్టణంగా తీర్చిదిద్దుతానని తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని గల్లి గల్లికి ఫైలెట్ కార్యక్రమంలో భాగంగా రాజీవ్‌కాలని, మల్‌రెడ్డిపల్లి, ఇందిరానగర్, పాతతాండూరు తదితర 19వార్డులలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ గత నలబై ఏళ్లలో చేయని అభివృద్ధ్దిని నాలుగేళ్లలోనే చేసి చూపించానని అన్నారు. ప్రతివార్డుకు రూ.కోటి మం జూరుతో 80శాతం పనులు పూర్తవుతాయాన్నారు.

ఇంకా ఏమైనా నిధులు అవసరమైతే తీసుకువచ్చి అభివృద్ధ్ది చేయిస్తానని హామీ ఇచ్చారు. రోడ్ల నిర్మాణాలు పూర్తి చేసి తాండూరు రూపురేఖలు మార్చి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి పక్షాలకు అదిరేది, బెదిరేది లేదని తగ్గే ప్రసక్తి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ ఛైర్ పర్సన్ దీపానర్సింలు, పట్టణ అధ్యక్షుడు అప్పు, అధికార ప్రతినిధి వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు విజయదేవి, వెంకన్నగౌడ్, ముక్తార్‌నాజ్, అస్లాం, ప్రభాకర్‌గౌడ్, నాయకులు నర్సింలు, శ్రీనివాస్‌చారి, హరిగౌడ్,సుధాకర్, సంజీవ్‌రావు, సంతోష్‌గౌడ్, రజాక్, ఎం.శ్రీనివాస్,జావెద్,ఇంతాజ్‌బాబ, రమేష్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News