Monday, December 23, 2024

10 ఏళ్ళలో ప్రతి ఇంట్లో ప్రగతి వెలుగులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక ధ్యేయంగా ప్రతిపక్షాల అధికార ఆరాటం ఎక్కువైపోయింది. తాము ఏమి చేశామో చెప్పుకోకుండా భవిష్యత్తులో తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తామనే స్పష్టత లేకపోవడం కాంగ్రెస్, బిజెపి పార్టీల అస్పష్టమైన నిర్ణయాలు ప్రజలకు అర్థం కాకపోవడంతో తెలంగాణలో ఇప్పుడు ప్రతిపక్షాలు కొత్త రాగం ఎత్తుకున్నాయి. తెలంగాణలో ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేకత వుందని అబద్ధ్దపు ప్రచారాన్ని సృష్టిస్తున్నారు. వాస్తవానికి ఇదంతా కెసిఆర్ మూడోసారి సిఎం అవుతున్నారనే అక్కసు అని స్పష్టంగా తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. మూడోసారి అధికారం చేపట్టి దక్షిణ భారత దేశంలో ఓ బలమైన శక్తిగా, భవిష్యత్తులో భారత దేశానికి నాయకత్వం వహించే స్థాయికి సిఎం కెసిఆర్ ఉండే అవకాశం ఉంది.ఒకవేళ అదే గనుక జరిగితే తెలంగాణలో, అటు దేశంలో తమ ఆటలు సాగవనే అంచనాకు రెండు జాతీయ పార్టీలు వచ్చాయి. ఎలాగైనా ఈ సారి కెసిఆర్‌ను, బిఆర్‌ఎస్‌ను దెబ్బకొట్టి ఆయన ఉనికి కొంత తగ్గిద్దామనే భ్రమలో విపక్ష పార్టీలు వున్నాయి. అందుకోసం అబద్ధపు మాటలు సృష్టి స్తూ ప్రజల్లో అయోమయాన్ని పెంచే పనిలో కార్యాచరణను మొదలుపెట్టారు. అయినా అటువంటి అబద్ధపు మాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితి లో లేరు.

కెసిఆర్‌ను ఎదుర్కోవడం ఆషామాషీ విషయం కాదని వారికి స్పష్టంగా తెలుసు. అందు కే అబద్ధపు ఆరోపణలతో బిఆర్‌ఎస్‌పై దుష్ప్రచారం చేయాలని చూస్తున్నా ప్రజలనుంచి వారికి మిశ్రమ స్పందనే వస్తున్నది. తెలంగాణ ప్రాంతం అధ్వానంగా మారడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీనే. ఆనాడు నాయకత్వ లేమి అనే కారణంతో బలవంతంగా ఆంధ్రతో కలిపిన నాటి నుంచి, మలి విడత తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మ బలిదానాల వరకు కాంగ్రెస్సే కారణం. తెలంగాణ మలి విడత ఉద్యమం కెసిఆర్ నాయకత్వంలో ఉధృతమవుతున్న నేపథ్యంలో కెసిఆర్ అనే రాజకీయ శక్తితో ఆనాడు పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి సుమారు పదేళ్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయకుండా తెలంగాణ ఉద్యమాన్నే నిర్వీర్యం చేయాలనే పెద్ద కుట్రకు దారితీసింది. ఆ కుట్రలను గమనించిన కెసిఆర్ కాంగ్రెస్ కపట నీతిని గ్రహించి ఉద్యమాన్ని మరింతగా ఉధృతం చేశారు. తెలంగాణ కోసం కెసిఆర్ ఆమరణ నిరాహార దీక్ష కు దిగితే తెలంగాణ ఇస్తున్నామంటూ ప్రకటన చేసి పక్షం రోజులు గడవక ముందే కృత్రిమ ఉద్యమసాకుతో తెలంగాణ ప్రకటనను వెనక్కి తీసుకొని తెలంగాణ ప్రజల ఆకాంక్షపై మరోసారి నీళ్లు చల్లారు. ఇలా వీలైనంత తెలంగాణను అడ్డుకునే ప్రయత్నమే చేశారు. సబ్బండ వర్గాలను ఏకం చేసి చావుకు తాను ముందు నిలబడి చేసిన ఉద్యమంతో కెసిఆర్ తెలంగాణను సాధించి ప్రజల ఆకాంక్షను సాకారం చేశారు.

2014లో తొలిసారి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొదలు అభివృద్ధి ఉద్యమాన్ని నిర్విరామంగా కృషి చేస్తూ వస్తున్నారు. తెలంగాణ 60 ఏళ్లు మోసానికి ఆరు సూత్రాల పథకం అమలు చేస్తామని ఆనాడు, నేడు ఆరు గ్యారంటీలంటూ తెలంగాణలో అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. ఆనాడు ఆరు సూత్రాలు అంటూ మభ్యపెట్టినప్పటికీ తెలంగాణకు జరిగిన అభివృద్ధి శూన్యం. 610 జిఒ అమలు చేస్తామని, తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ వారికే ఉద్యోగాలు ఇస్తామని ఒక్కటా, రెండా రాజకీయ అధికారం కోసం తెలంగాణను ఆశల పునాదుల మీద వుంచి ఎడారి గామార్చిన చరిత్ర కాంగ్రెస్‌ది. తెలంగాణ ఇచ్చింది మేమే అంటూ మరో ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ మలివిడత ఉద్యమం మండితేగానీ ఇవ్వలేదనే సంగతి మరిచిపోయింది. తెలంగాణ ను ఆగం జేసిన పార్టీ కాంగ్రెస్. అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణకు మాది గ్యారం టీ అనడాన్ని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. ఆరు గ్యారంటీలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు వస్తుండొచ్చు గానీ వాటితో తెలంగాణ ప్రజల బతుకులు మారవని తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఉద్యమ నాయకుని నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అంటూ తెలంగాణ ప్రజలు నిర్ణయానికి వచ్చారు.

తాము ఆకట్టుకునే ప్రకటనలు చేసినప్పటికీ తెలంగాణ ప్రజలు నమ్మడం లేదని అబద్ధపు ప్రచారంతో లబ్ధి పొందాలని చూస్తుంది కాంగ్రెస్. మరోవైపు బిజెపి తమ అధినాయకత్వాలను దింపి ఎన్నికల కోసం హడావుడి అభివృద్ధి ప్రారంభోత్సవాలు చేయించారు. పదేళ్లు పసుపు బోర్డు పట్టించుకోని నరేంద్ర మోడీ ఎన్నికల సమయానికి ఇందూరుకు వచ్చి పసుపు బోర్డు ప్రకటనచేసి కెసిఆర్ పాలనపై అందమైన అబద్ధాలతో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. తెలంగాణపై విషం చిమ్ముతూ తెలంగాణ ఏర్పాటును పదేపదే మోడీ వ్యతిరేకిస్తూనే ఇక్కడ అధికారం కోసం ఆరాటపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంలో బిజెపి ప్రత్యక్షంగా పాల్గొన్నది లేదు. బిల్లుపెడితే మద్దతు ఇస్తాం అని చెప్పుకొచ్చిందే తప్ప పార్లమెంటులో తెలంగాణ అన్యాయాలపై ప్రశ్నించలేకపోయింది. బిఆర్‌ఎస్ ఇప్పుడు దశాబ్దాల చరిత్ర వున్న జాతీయ పార్టీలను ఢీ కొట్టే స్థాయికి దశాబ్ద కాలంలోనే ఎదిగింది. ఈ దూకుడుని ఇప్పుడు దెబ్బ తీయకుంటే కెసిఆర్ రాజకీయ శక్తి భారత దేశ రాజకీయాలలో సంచలనంగా మారుతారనే భయం పట్టుకుంది. దక్షిణ భారత దేశం నుంచి బలమైన నాయకుడు కెసిఆర్‌ను అడ్డుకునే కుట్ర జరుగుతున్నది. అయినా కెసిఆర్‌కు ప్రజల సంపూర్ణ మద్దతు వుంది. అందుకే ఆయన నిర్ణయాల్లో నాన్చుడు వైఖరి అసలే ఉండదు. మానవీయ పథకాలతో ఈ పదేళ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతీ ఇంట్లో చిరునవ్వులై పూస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News