Friday, December 20, 2024

తెలంగాణ పల్లెల్లో వెల్లువిరుస్తున్న అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి  : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనలో పల్లెల్లో అభివృద్ధి వెల్లివిరుస్తుందని జడ్పి చైర్మన్, భూపాలపల్లి జిల్లా బిఆర్‌ఎస్ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శాయంపేట మండలం సాధనపల్లి, గంగిరేణిగూడెంలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వరంగల్ జడ్పి చైర్‌పర్సన్ గండ్ర జ్యోతి, స్పెషల్ ఆఫీసర్ హ రిప్రసాద్, ఎంపిడివో కృష్ణమూర్తిలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గండ్ర జ్యోతి మాట్లాడుతూ పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు అన్నట్లు పల్లెలు సాధికారత సాధించినప్పుడే దేశాలు బాగుపడతాయి అని పల్లెలకు అన్ని సౌకర్యాలు సిఎం కెసిఆర్ కల్పిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు పల్లెలు ఏ విధంగా ఉండేవో మనందరికి తెలుసు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లెలపై ప్రత్యేక దృష్టి సారించి పల్లెలను అభివృద్ధి చేశారన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్‌ను అందించి సఫాయి కార్మికులను నియమించి పల్లెల తడి చెత్త, పొడి చెత్త సేకరణ చేసి దాని ద్వారా వర్మీ కంపోస్టు తయారుచేస్తూ పల్లెలను పరిశుభ్రంగా ఉంచుతున్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో డంపింగ్‌యార్డు, పల్లె ప్రకృతి వనాలు క్రీడా ప్రాంగణాలు, స్మశానవాటికలు, ట్రాక్టర్ ట్యాంకర్, నర్సరీలు, అవెన్యూ ప్లాంటేషన్ ఏర్పాటుచేసుకున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అన్నారు. తెలంగాణ రాష్ట్రం రాక ముందు పల్లెలు శుభ్రంగా లేకపోవడంతో వివిధ వ్యాధుల బారిన పడే వారని, స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. ఈ సందర్భంగా సఫాయి కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, వివిధ శాఖల అధికారులు, అంగన్‌వాడీ ఆశాలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News