Wednesday, January 22, 2025

తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి ‘ప్రజా శాంతి పార్టీ’తోనే సాధ్యం

- Advertisement -
- Advertisement -
మణిపూర్ ఘటన నిరసన కార్యక్రమంలో కెఏపాల్ వెల్లడి

హైదరాబాద్ : ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభివృద్ది ప్రజాశాంతి పార్టీతో సాధ్యమని ఆపార్టీ అధ్యక్షులు కె.ఏ.పాల్ పేర్కొన్నారు. ఆదివారం మణిపూర్ సంఘటనపై చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మణిపూర్‌లో ఇంతటి ఘోరాలు జరుగుతుంటే అక్కడి సీఎం, హోం మినిస్టర్, డీజీపీలను ఇప్పటివరకు విధులను తొలగించకపోవడంతోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం చూస్తుంటే దీని వెనుక ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉన్నట్లు అర్థం అవుతోందన్నారు. మణిపూర్ ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో బిఆర్‌ఎస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తోందని, మరోసారి రాష్ట్రంలో బిఆర్‌ఎస్ గెలిచేందుకు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. అదే విధంగా బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీల మధ్య మ్యాచ్ ఫిక్స్ జరిగిందని, ఆపార్టీ నేతలు గులాబీ నేతలను ఈమధ్య కాలంలో విమర్శించడం లేదన్నారు.వచ్చే ఎన్నికల్లో రెండు రాష్ట్రాల ప్రజలు ప్రజాశాంతి అధికారంలోకి వచ్చేలా చూడాలని కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News