Monday, December 23, 2024

దేశంలో అభివృద్ధి వీచిక తెలంగాణ నుంచే వీయాలి : సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ జిల్లాలో సిఎం కెసిఆర్ పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్‌ను సిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కెసిఆర్ మాట్లాడుతూ . మహబూబాబాద్‌ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతం అని, ఇప్పుడు జిల్లా అయ్యాక అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందన్నారు. ఈ సందర్బంగా కెసిఆర్ కీలక ప్రకటన చేశారు. జిల్లాకు కొత్తగా ఇంజినీరింగ్ కాలేజ్‌ ఏర్పాటు చేస్తామని హామీఇచ్చారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు.

తెలంగాణ వచ్చాకా చాలా పనులు చేసుకున్నాం. చాలా జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు కట్టుకున్నాం. ఇప్పుడు మహబూబాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఈ కలెక్టరేట్‌ ప్రజాసమస్యలు తీర్చే కార్యాలయంగా మారాలని అన్నారు. తెలంగాణ రాకముందు 3, 4 వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని, రాష్ట్రం ఏర్పడ్డాక అనేక కొత్త వైద్య కళాశాలలను తెచ్చుకున్నామన్నారు.  త్వరలోనే ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల తీసుకొస్తామన్నారు.

ప్రతీ గ్రామ పంచాయతీకి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. దీంతో పాటు మహబూబాబాద్ పట్టణానికి రూ.50 కోట్లు, తొర్రూరు, మరిపెడ, డోర్న‌క‌ల్ కు రూ.25 కోట్లు చొప్పున సిఎం ప్రత్యేక నిధి నుండి మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. మంజూరు చేసిన నిధుల్లోని ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని స్థానిక మంత్రి, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు.

నదులలో అవసరానికి మించి నీరు ఉంటున్నాయని,నది జలాల కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. కానీ తీర్పు రావడానికి దశాబ్దాలు పడుతుందని, తీర్పుకు ఇంత జాప్యం జరిగితే నీళ్లు ఎప్పుడు వాడుకోవాలని కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఉంటేనే అభివృద్ధి చెందుతుందని , మత పిచ్చితో రగిలిపోతే అంతా నాశనమే అని మత విద్వేశాలు రెచ్చగొడితే దేశం మరో ఆఫ్ఘానిసాన్ అవుతుందని అన్నారు. దీని పై మత పెద్దలు , మేధావులు చర్చ జరపాలని కేంద్రం అసమర్థత వల్ల తెలంగాణ చాలా నష్టపోయిందని , కేంద్రంలో పక్షపాతం లేని ప్రభుత్వం ఉంటేనే దేశం అంతా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో అభివృద్ధి వీచిక తెలంగాణ నుంచే వీయాలని సిఎం కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News