Wednesday, January 1, 2025

అభివృద్ధి ఆయన మంత్రం : ఎమ్మెల్యే మెచ్చా

- Advertisement -
- Advertisement -

దమ్మపేట : అశ్వారావుపేట నియోజకవర్గంలో అన్ని బిటి రోడ్లు, సీసీ రోడ్లు చేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగా 3 రోజుల క్రితం దమ్మపేట మండలంలో ఐటిడిఏ శాఖ ద్వారా 2 కోట్ల 40 లక్షల రూపాయలతో నాగుపల్లి – చంద్రాయపాలెం, గుండేపట్వారీగూడెం – సీతారాంపురం రోడ్లు మంజూరు చేయించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించి పనులు మొదలుపెట్టారు. బుధవారం మండలంలో రామచంద్రాపురం – లింగాలపల్లి బిటి రోడ్డు ఏర్పాటు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం ఐటిడిఏ శాఖ ద్వారా కోటి 50 లక్షలు నిధులు బిటి రోడ్డు నిర్మాణం కోసం మంజూరు చేయించి, నిర్మాణ పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలుపుతూ ఆప్యాయంగా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు రావు జోగేశ్వరరావు , జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్, ఎంపీపీ సోయం ప్రసాద్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, ఎంపీటీసీలు, మండల నాయకులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ దారా యుగంధర్, నాయకులు, గ్రామ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News