Wednesday, January 22, 2025

పాలకుల నిర్లక్ష్యంతో ఎపిలో అభివృద్ది శూన్యం: తోట చంద్రశేఖర్‌

- Advertisement -
- Advertisement -
ఎపిలో బిఆర్‌ఎస్ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ
బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్
ఆంధ్ర సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో
తోట చంద్రశేఖర్‌కు ఘన సన్మానం

హైదరాబాద్ : తెలంగాణ అభివృద్ది నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉందని బిఆర్‌ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట అన్నారు. ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేసే పార్టీ బిఆర్‌ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. అన్నివర్గాల అభ్యున్నతి బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమౌతుందని పునరుధ్ఘాటించారు. ఆంధ్ర సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో బిఆర్‌ఎస్ ఎపి అధ్యక్షులు డాక్టర్ తోట చంద్ర శేఖర్‌కు శనివారం ప్రగతినగర్ సుందరయ్య భవన్‌లో సన్మానం చేశారు. ఈ సందర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణా అన్నీ రంగాల్లో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని స్పష్టం చేశారు. రైతు బంధు పధకాన్ని అమలు చేస్తూ రైతులకు 24 గంటలూ ఉచిత కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ మోడల్ అభివృద్దిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఆమడ దూరంలో ఉందన్నారు. ఆంధ్రాలో సహజ వనరులు,మానవ వనరులు పుష్కలంగా ఉన్నపట్టికి వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వలన ఆంధ్ర రాష్ట్రం అధోగతిపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆంధ్రప్రదేశ్‌లో బిఆర్‌ఎస్‌ను గ్రామ స్థాయి నుండి బలోపేతం చేస్తామని పేర్కొన్నారు.

రానున్న కాలంలో రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ కమిటీలను నియమిస్తామని చెప్పారు. తొలుత డాక్టర్ తోట భారీ ర్యాలిగా సభ వేదిక వద్దకు రాగా ఫోరం కార్యవర్గ సభ్యులు గజమాలతో ఘనంగా సత్కరించి జ్నాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి సిహెచ్ శ్రీకాంత్ సభాక్షధ్యత వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, కార్పొరేటర్లు అర్పిత,రాజేశ్వరి,అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, కూనపరెడ్డి వెంకటరావు, రాఘవేంద్ర ప్రసాద్, శ్రావణ్ కుమార్,చంద్రగిరి సతీష్ ,షేక్ రఫియా బేగమ్ ,భారాస శ్రేణులు, హైదరాబాద్‌లో స్తిరపడిన ఆంధ్ర ప్రాంత ప్రజానీకం, ఎపి నుండి బిఆర్‌ఎస్ నేతలు తోట సుబ్బారావు, అలమూరు రఫి, మెహబూబ్ బాష,తెనాలి బాష, తలారి శ్రీనివాస్, పెద్ద ఎత్తున బిఆర్‌ఎస్ శ్రేణులు హాజరయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News