Thursday, January 23, 2025

బిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యం

- Advertisement -
- Advertisement -

చిన్నచింతకుంట: బిఆర్‌ఎస్ ముఖ్యమంత్రి కెసిఆర్‌తోనే గ్రామాలు అభివృద్ధ్ది చెందుతున్నాయని జడ్పీ చైర్మన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆలవెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని లాల్కోట గ్రామంలో రూ. 20లక్షలతో నిర్మించనున్నప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంకు భూమి పూజ పల్లమర్రి గ్రామంలో డ్రైనేజీకు రూ. 5 లక్షలతో నిర్మించనున్న ఎస్సీ కమ్యూనిటి హాల్‌కు భూమి పూజ రూ. 10 లక్షలతో నిర్మించిన బీసీ కమ్యూనిటి హాల్‌ను వారు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాయని వారు అన్నారు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధ్దిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ , బిజెపి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీటీసీ వట్టెం రాజేశ్వరి రాము, అప్పంపల్లి సింగిల్‌విండో చైర్మన్ సురేందర్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు రవీందర్‌రెడ్డి, సంధ్య రత్నం, ఎంపీటీసీ శివరాజ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News