Monday, January 20, 2025

అభివృద్ధే మా అజెండా..

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/భూపాలపల్లిరూరల్‌: అభివృద్ధే మా అజెండాగా పనిచేస్తున్నామని భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. భూపాలపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో భూపాలపల్లి ఎంఎల్‌ఏ గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ రేగొండ మండలం సుల్తాన్‌పూర్ గ్రామంలో వద్ద హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం కొరకు రూ. 3 కోట్లు ద్వారా, టేకుమట్ల నుండి నవాబ్‌పేట రోడ్డు పిరియోడికల్ రెన్యూవల్, ఆజంనగర్ లింక్ రోడ్డు పిరియోడికల్ రెన్యూవల్ కొరకు రూ. 227లక్షలు, పస్రా నుండి భూపాలపల్లి రోడ్డు పిరియోడికల్ రెన్యువల్ కొరకు రూ. 107లక్షలు శాయంపేట మండలం సింగారం నుండి కాట్రపల్లి రోడ్డు పిరియోడికల్ రెన్యూవల్ కొరకు రూ. 150 లక్షలు, శాయంపేట మండలం మందారిపేట నుండి పోచారం నుండి కాట్రపల్లి వరకు రోడ్డు పిరియోడికల్ రెన్యూవల్ రూ. 215లక్షలు, శాయంపేట మండలం జోగంపల్లి గ్రామం నుండి ఆత్మకూర్ వరకు పిరియోడికల్ రెన్యూవల్ రూ. 176లక్షలు రోడ్లు భవనాల నుండి మంజూరయ్యింది.

పుల్లూరి రామయ్యపల్లి క్రాస్ రోడ్డు నుండి కొంపల్లి, సెగ్గంపల్లి రామాలయం మీదుగా కాశింపల్లి మెయిన్‌రోడ్డు వరకు బిటి రోడ్డు బ్యాలెన్స్ వర్క్ రూ. 1.33 కోట్లు, మినీ స్టేడియం, ఆడిటోరియం నిర్మాణం కొరకు రూ. 4.5 కోట్లు, సెంట్రల్ మెడిసిన్ స్టోర్ నిర్మాణం కొరకు రూ. 3.6కోట్లు, 100 పడకల ఆసుపత్రిలో పేషెంట్ అటెండర్స్ కొరకు షెడ్ నిర్మాణం 37 లక్షలు మంజూరు అయ్యాయని, అధిక వర్షపాతం వలన పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం కింద 5 జిల్లాలకు రూ. 1386.76 కోట్లు నిధులు మంజూరు చేయగా అందులో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మిర్చి పంటకు 2536 ఎకకరాలకు గాను రూ. 1, 36, 96,155లు 2417 మంది రైతులకు అందనున్నాయి.

అదేవిధంగా భూపాలపల్లి నియోజకవర్గంలో సిసి రోడ్ల నిర్మాణం కొరకు ఎంజిఎన్‌ఆర్‌జిఎస్ నిధుల నుండి రూ. 2కోట్లు , ఫ్లడ్ డ్యామేజ్ సిడి వర్క్‌కు, బిటి రెన్యువల్, ఎంఆర్‌ఆర్ నిధుల నుండి బస్తీ బాట కార్యక్రమంలో ఇచ్చిన మాట ప్రకారం దాదాపు రూ. 127లక్షల పనుల మంజూరు కొరకు కేటాయించడం జరిగింది. 45 నూతన గ్రామ పంచాయతీలకు రూ. 9కోట్ల నిధులను మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటి వరకు అన్ని శాఖల నుండి 60 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. దేశంలోనే అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వంపైన కళ్లు ఉండి చూడలేని ప్రతిపక్ష పార్టీ ఏవేవో మాట్లాడుతున్నారన్నారు. పాదయాత్రల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులకు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News