- Advertisement -
- తట్టేపల్లి పిఎసిఎస్ సిఇఒ రాజమౌళి
పెద్దేముల్: పరస్పర సహకారంతోనే రైతుల అభివృద్ధి సాధ్యమని, అందుకు సహకార సంఘాలు చేయుతనందిస్తాయని తట్టేపల్లి పీఏసీఎస్ సీఈఓ రాజమౌళి అన్నారు. శనివారం సహకార సంఘాల వారోత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని తట్టేపల్లి పీఏసీఎస్ ఆవరణలో వైస్ చైర్మన్ అంజయ్యతో కలిసి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఈఓ రాజమౌళి మాట్లాడుతూ… రైతులకు ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీన వర్గాలను బలోపేతం చేయడమే తమ సంస్థ లక్ష్యమని అన్నారు. సంఘం బలోపేతానికి ప్రతిఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జగదీశ్, రాంరెడ్డి, పి.శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -