Thursday, January 23, 2025

సిఎం కెసిఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి

నల్లబెల్లి: సీఎం కేసీఆర్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జనం బలంగా నమ్ముతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఈ నమ్మకంతోనే శుక్రవారం నల్లబెల్లి మండలం రామతీర్థం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామాధ్యక్షుడు పొదిల శోభన్, మాజీ సొసైటీ డైరెక్టర్ కామెర విమల, సీనియర్ నాయకుడు పొదిల అశోక్, కామెర శ్రీకాంత్, వండ్లూరి విజేందర్, పొదిల శ్రీకాత్, మేర్గు మధు, అక్కపెల్లి రాజేష్, కామెర రాములు, కామెర వీరన్న, బుద్ది మైనర్, బోనగాని రామన్నలతోపాటు 15 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరగా వీరికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గులాబి కండు వా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బానోతు సారంగపాణి, సొసైటీ ఛైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, సర్పంచ్ కిరణ్, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

*చెన్నారావుపేటలో.. బిఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఎంతో మంది గులాబీ గూటికి చేరుతున్నారని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. అందులో భాగంగానే చెన్నారావుపేట మండలం చెరువు కొమ్ముతండా గ్రామం నుంచి కాంగ్రెస్‌కు చెందిన భూక్య ఉమ్లా, భూక్య స్వామి, భూక్య రాజు, భూక్య నరేశ్‌తోపాటు పలు కుటుంబాలు బిఆర్‌ఎస్‌లో చేరాయి.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోడ విజయ బద్దునాయక్, సోషల్ మీడియా కన్వీనర్ బోడ మురళినాయక్, దయనాయక్, క్లస్టర్ బాధ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, వార్డుసభ్యులు, ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News