మరిపెడ : డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తోనే అభివృద్ధి సాధ్యమని ఉల్లెపల్లి ఎంపిటిసి భూక్య జ్యోతి రాంమూర్తి నాయక్ అన్నారు. ఆధివారం ఆమె మండలంలోని భూక్యతండా గ్రామ పంచాయితీ పరిధిలోని తేజావత్ తండాలో నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపిటిసి జ్యోతి మాట్లాడుతూ డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధే ఎమ్మెల్యే రెడ్యానాయక్ లక్షమన్నారు. పల్లె ప్రగతే రాష్ట్ర ప్రగతి అని, పల్లెలు, తండాల్లో రవాణా సౌకర్యం, మౌళిక వసతుల కల్పన జరిగినప్పడే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
దీనిలో భాగంగా సిఎం కెసిఆర్ సహకారంతో కోట్లాది నిధులు తీసుకువచ్చి ప్రతి గ్రామం, తండాకు తారురోడ్డు, సిసి రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత ఎమ్మెల్యే రెడ్యానాయక్‌దేనని కొనియాడారు. సిఎం కెసిఆర్ ఇచ్చిన వాగ్ధానం ప్రకారం తండాలను గ్రామ పంచాయితీలుగా చేసి వాటి అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృషి, జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావు సహకారంతో తండాలు, పల్లెలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు. రాష్ట్రంలోనే డోర్నకల్ అభివృద్ధిలో నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్న ఎమ్మెల్యే రెడ్యానాయక్‌కు వచ్చే ఎన్నికల్లో మరోసారి పట్టం కట్టాలని ఆమె ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాను, గ్రామ పెద్దలు భూక్య రాంమూర్తి నాయక్, సుధీర్ నాయక్, బోడియా నాయక్, గంగారం, బాల్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.