Thursday, January 23, 2025

అభివృద్ధే బిఆర్‌ఎస్ ధ్యేయం

- Advertisement -
- Advertisement -

శేరిలింగంపల్లి : అభివృద్ధి, సంక్షేమం ఆగకూడదమే ముఖ్య ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ కాలనీలో 4.50 కోట్ల రూపాయల అంచన వ్యయంతో చేపడుతున్న వరదనీటి కాల్వ నిర్మాణం పనులను జిహెచ్‌ఎంసి అధికారులతో కలిసి ఆయన బధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ కాలనీ ప్రజలకు వర్షాకాలంలో నెలకొన్న ఇబ్బందులు, వరద ముంపు వంటి సమస్యలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు తుగు చర్యలు తీసుకొని నేడ వరద నీటి కాల్వ నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందని అన్నారు.

రాబోయే వర్షా కాలన్నీ దృష్టిలో పెట్టుకొని వరద నీటి కాల్వ నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేయాలని, అదే విధంగా వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి పరిసరాలు నీట మునిగిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నాలాలో పేరుకుపోయిన చెత్త, మట్టిని పూడిక తీత ద్వారా తొలగించి నీరు సాఫీగా సాగేలా చూడాలని ఆయన అన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని వరద నీటి కాల్వ నిర్మాణం పనుల్లో ఎటువంటి జాప్యం లేకుండా నాణ్యతతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ శ్రీకాంతిని, చందానగర్ డివిజన్ బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు నరేందర్ బల్లా, సందీప్, అప్సర్, షరీప్ మరియు కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News