Wednesday, January 22, 2025

ఎపి పునర్నిర్మాణమే తప్ప నాకు రాజకీయ ఉద్దేశాలు లేవు: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటం తప్ప తనకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఐదేళ్లలో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగిందని తెలియజేశారు. దావోస్ సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు తన మీద నమ్మకంతో, ఎన్డీఏ మీద నమ్మకంతో పునర్నిర్మాణం చేయమని కూటమిని గెలిపించారన్నారు. రాష్ట్రాన్ని రీ బిల్డ్ చేసి, అభివృద్ధి పథంలో నడిపిస్తానని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ 2047 విజన్ ని సాధించటమే తన లక్ష్యమని బాబు స్పష్టం చేశారు. దావోస్ సదస్సులో ఎల్జీ కెమ్ లిమిటెడ్ సీఈవో షిన్ హక్ చియోల్‌ తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. 1.5 బిలియన్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో వున్న ఎల్జీ కెమ్‌ అనుబంధ సంస్థ ఎనర్జీని రాష్ట్రంలో నెలకొల్పాల్సిందిగా కోరారు. అలాగే తిరుపతిలో సెమీకండక్టర్ యూనిట్, మూలపేట, విశాఖలో పెట్రో కెమికల్ యూనిట్లను కూడా నెలకొల్పుకునే అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News