Wednesday, January 22, 2025

తెలంగాణ ఏర్పాటుతో విద్యా వ్యవస్థ అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

బోనకల్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం అనేక రంగాలలో అభివృద్ధి చెందిన విధంగానే విద్యా వ్యవస్థలో కూడా సమూల మార్పులుతోపాటు అభివృద్ధి జరిగిందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజు అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన ఊరు, మన బడి కార్యక్రం ద్వారా కలకోట గ్రామంలో నిర్మించిన అదనపు గదులను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమలరాజు మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవరం జరుపుకొంటున్నామన్నారు.

ప్రభుత్వం చదువుతోపాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకొంటుందని దాంట్లో భాగంగా ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉండేందుకు పుష్టికరమైన ఆహారం అందిస్తున్నారని కొత్తగా పిల్లలకు రాగి జావ ఇచ్చే కార్యక్రమం ఇప్పటి నుండే అమలులోకి వస్తుందని అన్నారు. మన బడి మన ఊరు ద్వారా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ప్రతి ఒక్కరు అండగా నిలవాలన్నారు.

ఈకార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ మొగిలి స్నేహలత, జెడ్‌పిటిసి మోదుగు సుధీర్‌బాబు, ఎంపిటిసి యంగల మార్తమ్మ ఎంపిపి కంకణాల సౌభాగ్యం, సర్పంచ్ యంగల దయామణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని చొప్పకట్లపాలెం, ముష్టికుంట్ల, చిరునోముల తదితర ఉన్నత పాఠశాలలో విద్యాదినోత్సవం ఘనంగా నిర్వహించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News