Friday, December 20, 2024

ఇక్కడా డబుల్ ఇంజిన్

- Advertisement -
- Advertisement -

Development of every town and village with double engine govt:Modi

సబ్‌కా సాథ్.. సబ్‌కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
టెక్స్‌టైల్స్ పార్కు నిర్మిస్తాం, హైదరాబాద్‌లో సైన్స్ సిటీ

ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
ఆవిర్భవించింది రైతులకు
మద్దతు ధర పెంచాం ఉచితంగా
రేషన్, టీకాలు అందించాం
విజయ సంకల్ప సభ వేదికగా
ప్రధాని నరేంద్ర మోడీ తెలుగులో
ప్రసంగం ఆరంభం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రజల్లో బిజెపిపై నమ్మకం పెరుగుతోందని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని ప్రధాని మోడీ అన్నారు. తెలంగాణలో టెక్స్‌టైల్ పార్క్ నిర్మిస్తామని ప్రకటించారు. ఆదివారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బిజె పి విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. కళాకారుల డప్పు చ ప్పుళ్లు, నృత్యాలతో బిజెపి నేతలు స్వాగతం పలికారు. అశేష జనవాహిని హర్షధ్వానాల మధ్య వేదికపైకి వచ్చిన నరేంద్ర మోడీ అందరికీ అభివాదం చేశారు. మోడీకి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం సభలో మోడీ ప్రసంగించారు. మొదట్లో తె లుగులో మాట్లాడి కార్యకర్తల్లో ఉ త్సాహం నింపారు. ‘సోదర సోదరీమణులకు నమస్కారాలు. ఎంతో దూరం నుంచి వచ్చిన ప్రతి కార్యకర్తకు అభినందనలు. తెలంగాణ నేల తల్తికి వందనం సమర్పిస్తున్నాం. తెలంగాణ గడ్డకు శిరస్సు వంచి న మస్కరిస్తున్నా’నంటూ తెలుగులో మాట్లాడారు. అనంతరం తన ప్రసంగాన్ని హిందీలో కొనసాగించారు. బి జెపిని ఆశీర్వదించేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలిపా రు. డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తే తెలంగాణలో సత్వర అభివృద్ధి జరుగుతుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే ప్రతి పట్టణం, పల్లె అభివృద్ధి చెందుతాయని వివరించారు.

తెలంగాణ ప్రజల ఆశీస్సుల కోసం వచ్చానన్న మోడీ, రాష్ట్ర అభివృద్ధే బిజెపి ప్రాధాన్యత అని స్పష్టపర్చారు. డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం రాష్ట్ర ప్రజలు పట్టాలు వేస్తున్నారని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధికి అందిస్తోన్న సహకారాన్ని వివరించారు. బిజెపి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తోందని, తెలంగాణ ప్రాచీన, పరాక్రమాల గడ్డ అని ఆయన అన్నారు. తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తినిస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాల కోసం బిజెపి ప్రభుత్వం ఎంతో చేసిందన్నారు. భద్రాచలం రాముల వారి ఆశీస్సులు మనకు వున్నాయని తెలిపారు. తెలంగాణలోని ప్రతి పేద,బడుగు, బలహీన వర్గాలకు కేంద్ర పథకాలు అందుతున్నాయన్నారు. ఉచిత రేషన్, ఉచిత వ్యాక్సిన్ అందించామని హైదరాబాద్ అన్ని రంగాల వారికి అండగా నిలుస్తోందన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణను అభివృద్ధి చేస్తామన్నారు.

ఎనిమిదేళ్లుగా దేశ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు ప్రయత్నించామని తెలిపారు. 2019 ఎన్నికల్లో బిజెపికి తెలంగాణ ప్రజలు మద్దతు పలికారని, 2019 నుంచి తెలంగాణలో పార్టీ బలపడుతోందన్నారు. కరోనా సమయంలో తెలంగాణ ప్రజల కోసం చాలా చేశామని తెలిపారు. జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజెపి జెండా ఎగిరిందని ఆయన గుర్తు చేశారు. దళితులు, ఆదివాసీలు, పేదల ఆకాంక్షలను బిజెపి నెరవేర్చిందన్నారు. హైదరాబాద్‌లో సైన్స్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని, బయో మెడికల్ సైన్సెస్ కేంద్రాలు ఏర్పాటవుతున్నాయన్నారు. మహిళా సాధికారత దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. మహిళా శక్తిని దేశ శక్తిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు. బ్యాంకు డిపాజిట్లలో మహిళల వాటా పెరిగిందన్నారు. కొత్త జాతీయ విద్యా విధానంలో మాతృభాషకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. తెలుగులో సాంకేతిక విద్య, వైద్య విద్య అందుబాటులోకి వస్తే పేదల కలలు సాకారమవుతాయన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించామని అన్నారు. తెలంగాణలో రూ.35 వేల కోట్లతో ఐదు భారీ ప్రాజెక్టులు చేపట్టామన్నారు.

తెలంగాణలో ప్రతి పల్లెకు రోడ్డు అనుసంధానం చేస్తున్నామన్నారు. రైతుల కోసం ఎంఎస్‌పిని పెంచామన్నారు. హైదరాబాద్‌లో 1500 కోట్లతో ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్‌లు నిర్మిస్తున్నామని ప్రధాని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్ కూడా కేటాయించామని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం పెంచామని, ఆవిష్కరణల్లో దేశంలోనే తెలంగాణ కేంద్రంగా మారిందని గుర్తు చేశారు. తమ పాలనలో గ్రామాల్లోని యువతకు ప్రొత్సాహం ఇస్తున్నామని ప్రధాని చెప్పారు. తెలంగాణలో రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. తెలంగాణలో 5 వేల కిలోమీటర్ల మేర నేషనల్ హైవేలను అభివృద్ధి చేశామని చెప్పారు. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చి తీరుతుందని మోడీ పునరుద్ఘాటించారు.

వచ్చేది బిజెపి ప్రభుత్వమే
విజయ సంకల్ప సభలో అమిత్ షా

తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వచ్చేది బిజెపి ప్రభుత్వమేనని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల లక్షాన్ని సాధించామా? అని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అయ్యిందా అని అమిత్ షా నిలదీశారు. వచ్చేసారి బిజెపి ప్రభుత్వమే వస్తుందని ఆయన జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్ గుర్తు అయిన కారు స్టీరింగ్ ఒవైసీ చేతుల్లో వుందని ఆయన ఎద్దేవా చేశారు. సర్దార్ పటేల్ లేకపోతే హైదరాబాద భారతలో భాగం అయ్యేది కాదని అమిత్ షా వ్యాఖ్యానించారు. విమోచన దినాన్ని కెసిఆర్ ఎందుకు అధికారికంగా జరపడం లేదని ఆయన ప్రశ్నించారు. ఒవైసికి భయపడే విమోచన దినాన్ని టిఆర్‌ఎస్ సర్కార్ జరపడం లేదని అమిత్‌షా దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వస్తే ఎవరికీ భయపడకుండా విమోచన దినం జరుపుతామని ఆయన స్పష్టం చేశౠరు. వచ్చేసారి సచివాలయానికి వెళ్లేది బిజెపి ముఖ్యమంత్రేనని ఆయన జోస్యం చెప్పారు. దేశం పురోగమిస్తుంటే తెలంగాణ తిరోగమిస్తోందని అమిత్ షా అన్నారు. తెలంగాణ ప్రజలు ఒక్కసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని కోరారు.

మోడీ గొప్పతనం తెలుసా.. ఎందుకు తిడుతున్నారు
టీఆర్‌ఎస్ నేతలపై బండి సంజయ్ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీపై టిఆర్‌ఎస్ నేతలు ఉపయోగిస్తున్న భాష సరిగా లేదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పులి వస్తుందంటే గుంట నక్కలు పారిపోతాయంటూ వ్యాఖ్యానించారు. మోడీని ఎందుకు తిడుతున్నారో టిఆర్‌ఎస్ నేతలు చెప్పాలని బండి సంజయ్ ప్రశ్నించారు. కరోనా టీకాలు ఉచితంగా ఇచ్చినందుకా మోడీని తిడుతున్నారని ఫైరయ్యారు. పేద ప్రజలకు ఉచిత బియ్యం ఇస్తున్నందుకా మోడీని తిట్టడం అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ నుంచి విద్యార్ధులను తీసుకొచ్చినందుకా మోడీని తిడుతున్నారని ఆయన ఫైరయ్యారు. దేశ ప్రజల పాలిట మోడీ దేవుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కొత్త రాష్ట్రం తెలంగాణకు కేంద్రం వేల కోట్ల నిధులు ఇస్తోందని.. రాజకీయ లబ్ధి కోసమే మోడీని టిఆర్‌ఎస్ సర్కార్ తిడుతోందని ఆరోపించారు.

తెలంగాణలో అభివృద్ధి జరగాలని మోడీ పదే పదే చెబుతున్నారని సంజయ్ స్పష్టం చేశారు. టిఆర్‌ఎస్ నేతలకు మోడీ గొప్పతనం తెలియడం లేదని కేంద్రాన్ని బద్నామ్ చేయాలని టిఆర్‌ఎస్ సర్కార్ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సహకరించడం లేదని.. అందుకే ఇక్కడ బిజెపి ప్రభుత్వం రావాలని బండి సంజయ అన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన బిజెపి శ్రేణులు వెనక్కి తగ్గరని ఆయన స్పష్టం చేశారు. మరో 20 ఏళ్ల పాటు కేంద్రంలో బిజెపి ప్రభుత్వమే వుంటుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News