Wednesday, January 22, 2025

1.77లక్షల ఎకరాల్లో హరిత వనాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

Development of greenery in 1.77 lakh acres

మనతెలంగాణ/హైదరాబాద్ : పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలో 1.77లక్షల ఎకరాల విస్తీర్ణంలో హరిత వనాలు అభివృద్ధి చేస్తున్నట్టు అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎ.శాంతి కుమారి వెల్లడించారు. హైదరాబాద్ పరిసరాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 179 పట్టణ ప్రాంత అటవీ పార్కుల ఏర్పాటు పనునులపై స్పెషల్ సిఎస్ అరణ్యభవన్‌లో మగంళవారం నాడు వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా శాంతి కుమారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ సూచనలకు అనుగుణంగా రాష్ట్రంలో చిక్కటి పచ్చదనం ,అందమైన ప్రకృతితో వెల్లివిరియాలన్నారు. హరిత వనాల్లో మొత్తం రెండు కోట్ల మొక్కలు నాటాలని గతంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అన్ని హరిత వనాల్లో ఖాళీ ప్రదేశాల్లో పోడవుగా పెరిగే మొక్కలు నాటడం ద్వారా చిక్కదనంతో కూడిన పచ్చదనం పెరిగేలా , జీవ వైవిధ్యం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

శాఖల వారీగా వివిధ ప్రాంతాల్లో చేపట్టిన పార్కుల పురోగతిని సమీక్షించారు. రెండు కోట్ల మొక్కలు నాటాలన్న లక్షంలో ఇప్పటివరకూ 60లక్షల మొక్కలు నాటడం పూర్తయినట్టు అధికారులు తెలిపారు. మిగతా కోటి 40లక్షల మొక్కలను నాటే పనులను వచ్చే నవంబర్ నాటికల్లా వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన అటవీ పార్కులపై వివిధ వర్గాల నుంచి మంచి ్రప్రశంసలు వస్తున్నాయని , అదే స్ఫూర్తితో మిగతా పార్కుల పనులను పూర్తి చేయాలని కోరారు.

ఆరోగ్యం ,అహ్లాదం కోసం పార్కులకు వచ్చే వారికి కనీస సౌకర్యాలతో పాటు ,పర్యావరణం ,అడవుల పునరుద్ధరణపై అవగాహణ పెరిగేలా ఆయా అటవీపార్కులను తీర్చిదిద్దాలన్నారు. హరిత వనాలు అభివృద్ధి చేస్తున్న ప్రాంతాలలో అటవీ సరిహద్దుల గుర్తింపు ,తక్షణ వివాదాల పరిష్కారం చేపట్టాలని సూచించారు. వివాదాల పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్‌తో పాటు సంబంధింత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, పిసిసిఎఫ్ (షోషల్ పారెస్ట్రీ) , ఆర్ ఎం డొబ్రియల్ ,పురపాలక శాఖ కమీషనర్ డా.సత్యనారాయణ, జిహెచ్‌ఎంసి కమీషనర్ డిఎష్ లోకేష్ కుమార్ , పారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ విసి చంద్రశేఖర్ రెడ్డి, హెచ్‌ఎండిఏ డైరెక్టర్ ప్రభాకర్ తదితర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News