Monday, December 23, 2024

ఆరోగ్య శాఖ అభివృద్ధి భేష్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆరోగ్యశాఖ అభివృద్ధిపై ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్భరుద్దీన్ ఓవైసీ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రి హరీశ్ రావుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజూ సమావేశాల్లో భాగంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ఏర్పాటు, ఎంబిబిఎస్ సీట్లు తీసుకురావడంలో తెలంగాణ ప్రభుత్వం గొప్పగా కృషి చేసిందని, వైద్య రంగంలోనే ఇది సరికొత్త రికార్డ్ అని ఆయన కొనియాడారు. ప్రతి మున్సిపాలిటీలో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడం శుభపరిణామమని చెప్పారు. ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచినందుకు ఆయన సిఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన ఏర్పాటును స్వాగతిస్తున్నానని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News