Wednesday, January 22, 2025

విద్యతోనే కురుమల అభివృద్ధి సాధ్యం

- Advertisement -
- Advertisement -
  • దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ

చేవెళ్ల: రజాకార్ల దురాగతాలను, దుర్మార్గాలపై విరోచితంగా పొరాడిన మహా ధైర్యశాలీ దొడ్డి కొమురయ్య అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని ఇంద్రారెడ్డి చౌరస్తాలో మండల కురుమ సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య విగ్రహావిష్కరణకు ఆయన సోమవారం హాజరై విగ్రహాన్ని ప్రారంభించారు. డోలు దరువులు, పోతురాజుల విన్యాసాలు, లంబాడ మహిళల ఆట పాటలతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.

బీజాపూర్‌ హైదరాబాద్ అంతరాష్ట్ర రాహదారిపై డోలు దరువులు, పోతురాజుల విన్యాసాలు, లంబాడ మహిళల ఆట పాటలు అందరిని ఆలరించాయి. చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్‌రెడ్డి, ఎగ్గే మల్లేషం, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్ అనితా హరినాథ్‌రెడ్డి, చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, ప్రజా గాయకురాలు విమలక్కలతో కలిసి ఆయన విగ్రహావిష్కరణ చేశారు. అంతకుముందు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ శాంతికపోతాన్ని ఎగురవేశారు.

అనంతరం స్థా నిక కేజిఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రజాకార్ల, దేశ్‌ముఖ్‌ల, దొరలు, జమీందార్ల, దుర్మార్గాలను, దురాగతాలను చూసి తట్టుకోలేని దొడ్డి కొమురయ్య సాయుధ తెలంగాణ పొరాటంలో పాల్గొ ని ప్రాణ త్యాగం చేశారన్నారు. కురుమలు అభివృద్ధి సాధించాలంటే విద్యతోనే సాధ్యమని తెలిపారు. విద్యతోనే భవిష్యత్తు ఉందన్నారు. కురుమలంతా తమ వృత్తిని కూడా కాపాడుకోవాలని ఆయన సూచించారు. సామాజిక తెలంగాణ వచ్చినప్పుడే దొడ్డి కొమురయ్యకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత దొడ్డి కొమరయ్య: ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రధాత, పొరాట యోధుడు దొడ్డి కొమరయ్యని చేవెళ్ల ఎంపి గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలు పేర్కొన్నారు. నిజాం రాజుల దురాగతాలను, అరచకాలకు వ్యతిరేకంగా భీకరంగా పొరాడి తన ప్రాణాలను సైతం సాయుధ పొరాటంలో కోల్పోయిన (అమరుడైన) తొలి తెలంగాణ బిడ్డ దొడ్డి కొమురయ్య ఆ స్ఫూర్తిని ప్రతి తెలంగాణ బిడ్డలంతా అం దిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.

చేవెళ్లలో కురుమ సంఘం భవన నిర్మాణానికి ఆరు వందల గజాల స్థలం కేటాయించేలా చూస్తామని ఎంపి, ఎమ్మెల్యే హామీనిచ్చారు. సీఎం కేసిఆర్ హైదరాబాద్‌లో కురుమ సంఘానికి ఐదు ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా కురుమలను ఆదుకుంటుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భామయ్యాక దొడ్డి కొమురయ్య జయంతి, వర్థంతి వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ భవన నిర్మాణానికి తనవంతుగా రూ. 25 లక్షలను ఇస్తానని తెలిపారు. ఈ సందర్భ ంగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేషం మాట్లాడుతూ ఎమ్మెల్సీ నిధుల్లో నుంచి రూ.50 లక్షల భవన నిర్మాణానికి కేటాయిస్తామని హామీనిచ్చారు. అరుణోదయ కళాకారుల సంఘం అధ్యక్షురాలు విమలక్క మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో దొడ్డి కొమురయ్య మనువడు దొడ్డి చంద్రం, కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిష్టగోని సదానందం, క్యామ మల్లేష్, బిసి కమిషన్ సభ్యులు శుభప్రద్‌పటేల్, ప్రొఫెసర్ పాశం గిరి, చేవెళ్ల ఎంపిపి మల్గారి విజయలక్ష్మీరమణారెడ్డి, జడ్పిటీసి సభ్యురాలు మర్పల్లి మాలతికృష్ణారెడ్డి, సర్పంచ్ బండారు శైలజా ఆగిరెడ్డి, మాజీ ఎంపిపి మంగలి బాల్‌రాజ్, చేవెళ్ల మండల కురుమ సం ఘం అధ్యక్షులు కసిరే వెంకటేష్, ఉపాధ్యక్షులు దండు సత్యనారాయణ, ప్రధా న కార్యదర్శి తిరుమలి కుమార్, మాజీ అధ్యక్షులు శ్రీనివాస్‌యాదవ్, గుత్తి మల్లేష్, ఈరమోల్ల మల్లేష్, ఆయా మండలాల కురుమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News