- తుక్కుగూడ మున్సిపాలిటీలో పలు అభివృద్ధ్ది పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు: పట్టణాలకు దీటుగా అన్ని రంగాలలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం తుక్కుగూడ మున్సిపాలిటీ మంఖాల్‌లో 6,7,8వ వార్డులలో రూ. కోటి 36 లక్షల నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడు తూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధ్దే లక్షంగా పనిచేస్తూ గ్రామాలను, పట్టణాలను, మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పనలో పక్కా ప్రణాళికతో ముందుకెళ్లడం జరుగుతుందని అన్నారు. నివాస ప్రాంతాల్లో ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా నీటి సరఫరా అందిస్తున్నామన్నారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి చేపట్టి వేల కోట్ల నిధులతో ఎప్పటికప్పుడు పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నామన్నారు. మున్సిపల్, పట్టణాభివృద్ధ్ది శాఖ మంత్రి కేటిఆర్ కృషితో మహేశ్వరం నియోజకవర్గంలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధ్దికి తాగునీరు, నాలాల సమస్య శాశ్వత పరిష్కారానికి రూ.320 కోట్లతో పనులు చేపడుతున్నట్లు ఆమె తెలిపారు.
సమీకృత మార్కెట్లు, వైకుంఠధామాలు నిర్మించడంతోపాటు రోడ్లు, కనీస సౌకర్యాలు కల్పన మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. రూ. 40 కోట్ల నిధులతో 10 చెరువుల సుందరీకరణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ మున్సిపల్ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్, నాయకులు రవినాయక్, జెల్లల లక్ష్మయ్య, రెడ్డిగల్ల సుమన్, సామెల్ రాజు, అధికారులు , ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.