Monday, December 23, 2024

రాచకొండ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: రాచకొండ ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని మునుగోడు శాసన సభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంస్థాన్ నారాయణపురం మండలం రాచకొండ ప్రా ంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా 9 సంవత్సరాల క్రితం రాచకొండ ప్రాంతంలో గుప్త నిధుల తవ్వకాల్లో బయటపడిన ఎనిమిది అడుగుల శివలింగం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రేచర్ల పధ్మనాయకుల కాలంలో నిర్మించిన ప్రాచీన శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో తవ్వకాల్లో బయటపడిన శివలింగాన్ని శివాలయంలో ప్రతిష్టి ంచి, ప్రాచీన శివాలయం పునఃరుద్దరణ పనులు ప్రాంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాచకొండలో ప్రాచీన శివాలయం పునఃరుద్దరణ పనులు చేపట్టడం గొప్ప అనుభూతినిచ్చిందన్నారు. శివాల యం పునఃరుద్దరణ పనులకు 6 కో ట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యం తో దేవాలయం నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి వీరమల్ల భానుమతి, పిఎసిఎస్ చైర్మన్ జక్కిడి జంగారెడ్డి, వైస్ ఎంపిపి రాజు, బిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షులు కత్తుల లక్ష్మయ్య, సర్పంచులు జర్పుల కవిత, శ్రీనూ నాయక్, ఒగ్గు గణేష్, ఎంపిటిసిలు భాస్కర్ నాయక్, మోత్యానాయక్, నాయకులు మన్నె ఇంద్రసేనారెడ్డి, వీరమల్ల వెంకటేశం, పల్లె గోవర్ధన్‌రెడ్డి, శివరాత్రి విద్యాసాగర్, బొడ్డుపల్లి గాలయ్య, ప్రముఖరెడ్డి, రాచప్ప సమితి సభ్యులు బద్దుల కృష్ణకుమార్ యాదవ్, సూరపల్లి వెంకటేశం, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News