Monday, December 23, 2024

మన ఊరు మన బడితో పాఠశాలల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్

సదాశివపేట: ప్రభుత్వం విద్యారంగాన్ని అభివృద్ధి చేసి ప్రతిఒక్కరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేలా సర్కార్ ప్రోత్సహిస్తోందని రాష్ట్ర చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. మంగళవారం సదాశివపేటలోని రహమత్‌నగర్‌లో న్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో అన్ని వసతులు డ్యూయల్ డెస్క్, ప్రహారీగోడ మూత్రశాలలు, లైబ్రరీలను అభివృద్ధి చేశామన్నారు. మన బస్తీ మన బడి కార్యక్రమంలో 24 పాఠశాలలు మొదటి విడతలో ఎంపికై మూడు పాఠశాలలు పూర్తిగా ఉపయోగానికి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింత గోపాల్, కౌన్సిలర్‌లు పిల్లోడి విశ్వనాథం, ప్రకాష్, మండల విద్యాధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయుడు అమీరుద్దీన్, ఎస్‌ఎంసి చైర్మన్ వసీమా బేగంలున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News