Monday, January 20, 2025

బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాల అభివృద్ధి

- Advertisement -
- Advertisement -

మరిపెడ: బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తండాలు, గ్రామాలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం ఆయన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం వీరారం, బాల్యాతండా, దంట్లకుంటతండా గ్రామ పంచాయితీల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా గ్రంథాలయ సంస్ధ చైర్మన్ గుడిపుడి నవీన్‌రావుతో కలిసి శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ఆయా గ్రామాల్లో బిఆర్‌ఎస్ శ్రేణులు ఎమ్మెల్యేకు బతుకమ్మలు, బోనాలు, కోలాటాలు, నృత్యాలు, డాన్స్‌లతో పూలు చల్లుకుంటూ ఘన స్వాగతం పలుకగా ఎమ్మెల్యే వారితో డాన్స్ చేశారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఆయా గ్రామాల్లోని స్ధానిక నాయకులతో కలిసి తిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం వీరారం సర్పంచ్ అజ్మీరా పద్మహరినాయక్, బాల్యాతండా సర్పంచ్ జరుపుల స్వాతి, దంట్లకుంటతండా సర్పంచ్ గుగులోతు భరత్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఎం కెసిఆర్ పాలనలో గ్రామాలు, తండాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని, దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా గ్రామాల అభివృద్ధి కోసం లక్షలాది రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. దేశానికి పల్లెలే పట్టుగొమ్మలని, గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి బిఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, మురుగు కాలువలను నిర్మించి.. ప్రజలకు కావాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పాలన సౌలభ్యం తండాను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. స్వరాష్ట్రంలో కెసిఆర్ ప్రభుత్వం తండాలను పంచాయితీలుగా మార్చి గిరిజనుల చిరకాల వాంఛను నేరవేర్చారని, దీంతో వారే సర్పంచులు, వార్డు మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. అమరుల త్యాగాల ఫలితంగా ఎర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమ నేత కెసిఆర్ సిఎం కావడం మన అదృష్టమన్నారు.

దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సిఎం కెసిఆర్ రైతును రాజు చేశారని, రైతు బంధు, రైతు భీమా పథకాలతో పాటు ఆసరా పించన్లుతో ఆయా వర్గాలకు అండగా నిలిచారని వివరించారు. వ్యవసాయానికి ఉచితంగా నిరంతర విద్యుత్ ఇస్తుండటంతో పంటల సాగు పెరిగిందన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో ఎక్కడా లేదన్నారు. స్వరాష్ట్రంలో అన్ని వర్గాలకు అండగా నిలిచిన ఘనత సిఎం కెసిఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ రాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు అయ్యేదా? అక్కడి నుంచి పుష్కలంగా సాగునీరు వచ్చేవా? సంవృద్ధిగా పంటలు పండేవా? అని ప్రశ్నించారు. సంక్షేమ ప్రత్యేక రాష్ట్ర ఫలాలు ప్రజలు అందాలని, నమ్మకంతో అధికారం అప్పగించిన ప్రజల నమ్మకం వమ్ము కాకుండా పని చేస్తున్నారని తెలిపారు. భవిష్యత్ మరింత మంచిగా ఉండాలంటే సిఎం కెసిఆర్ పాలకులుగా ఉండాలన్నారు. అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేస్తామన్నారు.

ఈ జీవితం ప్రజా సేవకే అంకితమని, ప్రజల అభిమానం వెలకట్టలేనిదని, సదా ప్రజా సేవకే తన జీవితం అంకితమన్నారు. అనుక్షణం ప్రజల మధ్యనే ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం అహర్నిశలు కృషి చేస్తూ, నియోజకవర్గ అభివృద్ధే లక్షంగా పని చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉండి దీవించాలని, మరోసారి అవకాశం కల్పించాలని తెలిపారు.పేదల సంక్షేమం కోసం ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కెసిఆర్ కిట్ వంటి అనేక పథకాలను బిఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. తెలంగాణ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తున్నామన్నారు. ఇంటి జాగలు ఉన్న అర్హులైన నిరుపేదలకు ఇళ్లు ఇస్తామని, అర్హులైన వారికి దళిత బంధు పథకం కింద యూనిట్లు అందజేస్తామన్నారు. సెప్టెంబర్ 30 వరకు రైతుల రుణమాఫీ ప్రభుత్వం చేయనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో ఉన్న తాగునీరు, విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను అదేశించారు.

స్వరాష్ట్రం ఏర్పడ్డాక ఈ తొమ్మిదేళ్లలో అన్ని వర్గాలకు సిఎం కెసిఆర్ న్యాయం చేశారని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్షంగా అహర్నిశలు కృషి చేస్తున్న బిఆర్‌ఎస్ ప్రభుత్వాని ప్రజలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుగులోతు అరుణ రాంబాబునాయక్, జడ్‌పిటిసి తేజావత్ శారధా రవీందర్‌నాయక్, మాజీ ఎంపిపి గుగులోతు వెంకన్న, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు తాళ్లపెల్లి శ్రీనివాస్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు జరుపుల కాలునాయక్, బిఆర్‌ఎస్ జిల్లా నాయకులు గుగులోతు రాంబాబునాయక్, తేజావత్ రవీందర్‌నాయక్, అయూబ్‌పాషా, ఎంపిటిసి అజ్మీరా జిక్కి నారాయణ, పిఏసిఎస్ డైరెక్టర్ బానోతు హరినాయక్, ఉప సర్పంచ్‌లు గుగులోతు హరి, కోమి రాజు, గ్రామ పార్టీ అధ్యక్షులు మామిడాల మునేష్, చోక్లనాయక్, పాప నాయక్, బిఆర్‌ఎస్ నాయకులు భూక్య వెంకన్న, బొల్లం నర్సయ్య, దుస్సా నర్సయ్య, పాండునాయక్, రవి, బోజ్యా, బాదావత్ వెంకన్న, జెమిని వీరన్న, భూక్య ప్రవీణ్ నాయక్, శ్రీనివాస్, హలు నాయక్, రమేష్, శివరాత్రి వెంకన్న, నాగరాజు, లాలు, చిన్ని, గుండె నాగభూషణం, గుండె రామన్న, తహశీల్ధార్ పిల్లి రాంప్రసాద్, ఎంపిడిఓ కేలోతు ధన్‌సింగ్, పిఆర్ ఏఈ శ్రీనివాస్, మిషన్ భగీరథ అధికారులు, విద్యుత్ అధికారులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News