Monday, December 23, 2024

బంగారు తెలంగాణ కల సాకారం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా: దేశం లోనే తెలంగాణ అభివృద్ధి పథంలో అగ్రభాగాన నడుస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవా రం రంగారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి పోలీసులు గౌరవ వందనంతో జిల్లా యంత్రాంగం తరపున ఘన స్వా గతం పలికారు. అనంతరం మంత్రి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జిల్లా ప్రజలనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ తొమ్మిదేళ్ల సూపరిపాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకుని, పదవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భం గా ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాల్లో సబ్బండవర్ణాలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కేసిఆర్ ప్రభుత్వ ధ్యేయమని, రాష్ట్ర అభివృద్ధే అమరులకు అసలైన నివా ళి అని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని వివరించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ఆప్యాయంగా పలుకరిస్తూ, అమరవీరుల కుటుంబాలను సత్కరించారు. ప్రభుత్వం వారికి అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి భరోసా కల్పించారు. జిల్లా జీవన జ్యోతి మహిళ సమాఖ్యకు 59 కోట్ల 22 లక్షల, 17 కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు. ఆర్థిక పునరావాస పథకంలో భాగంగా 50,000-ల చొప్పున ఏడుగురు ట్రాన్స్ జెండర్లకు చెక్కులను మంత్రి అందజేశారు. గిరిజన సంక్షేమ శాఖ తరపున పాం డుకు వాహనాన్ని అందజేశారు. కులాంతర వివాహం చేసుకున్న రెండు జంటలకు సోషల్ వెల్ఫేర్ శాఖ తరపున చెక్కులను మంత్రి అందజేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఆమనగల్, కడ్తాల్, శివరాంపల్లి, తలకొండపల్లి ప్రభుత్వ పాఠశాలల నుండి, స్టేట్ హోమ్ నుండి వచ్చిన చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరింపజేశాయి. అనంతరం చిన్నారులకు మెమోంటోలు మంత్రి అందజేశారు.
అమరవీరులకు శ్రద్ధాంజలి
ఉదయం 8.00 గంటలకు సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో అమరవీరుల స్మారక స్థూపానికి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ అనిత హరినాథ్‌రెడ్డి, ఎమ్యెల్సీలు దయానంద్, ఎగ్గే మల్లేష్, ఎల్.బి.నగర్ శాసన సభ్యులు సుధీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరీశ్, రాచకొండ పోలీస్ కమిషనర్ డి.ఎస్.చౌహాన్, జిల్లా అదనపు కలెక్టర్లు తిరుపతి రా వు, ప్రతిక్ జైన్ ఘన నివాళులు అర్పించారు. 60 ఏళ్ల సుదీర్ఘ పోరాటం,14 ఏళ్ల కేసిఆర్ నాయకత్వంలో మలిదశ ఉద్యమ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం కల సాకారం అయ్యిందని మంత్రి వేముల అన్నారు.

అమరవీరుల త్యాగాల పునాదులపై, పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు అనేక రంగాల్లో యా వత్ దేశానికి దిక్సూచిగా నిలుస్తూ సగర్వంగా తలెత్తుకుని నిలబడిందని అన్నా రు. గడిచిన తొమ్మిదేళ్లలో సాధించిన అభివృద్ధి స్పూర్తితో ఇకముందు కూడా తెలంగాణ ప్రగతిలో అన్ని వర్గాల ప్రజలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, రాచకొండ పోలీ స్ అధికారి, ట్రైనీ కలెక్టర్ కధీరవన్ ఫళని డీఆర్‌ఓ హరిప్రియ, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ వెంకటచారి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు వెంకటరమణరెడ్డి, కలెక్టరేట్ ఏఓ ప్రమీల రాణి, జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News